దేవుడు అందరికి అన్నీ ఇవ్వడు అంటారు. నిజమే.. ఈ భూ ప్రపంచంలో ఒక్కొక్కరిది ఒక్కో కష్టం. చేతిలో కాసులు ఉంటే అన్నీ కష్టాలు తీరిపోతాయి అంటారు. కానీ.., కోటీశ్వరులకి కూడా వారి కష్టాలు వాళ్ళకి ఉంటాయి. అలాంటి ఓ విచిత్ర సంఘటన ఇది. ఆ వివరాల్లోకి వెళ్తే.., పెద్దపల్లి జిల్లాకి చెందిన మహేశ్ తల్లిదండ్రలకి వందల కోట్ల ఆస్తి ఉంది. అంతటికి మహేశ్ ఒక్కడే వారసుడు. కొడుకుని అల్లారు ముద్దుగా పెంచుకుంటూ వచ్చారు.
అడిగింది ఏదైనా క్షణాల్లో అతని కాళ్ళ ముందుకి వచ్చేలా ఏర్పాట్లు చేశారు తల్లిదండ్రులు. కానీ.., మహేశ్ పెద్దవాడు అయ్యే కొద్దీ అతని శరీరంలో అసాధారణ మార్పులు రావడం గమనించాడు. మిగతా మగవారిలా తనకి కోరికలు లేకుండా పోయాయి. నిదానంగా తాను హిజ్రా అన్న విషయం మహేశ్ కి అర్ధం అయ్యింది. తల్లిదండ్రులు కూడా ఈ విషయాన్ని గమనించలేకపోయాడు. రోజులు గడిచే కొద్దీ.., మహేశ్ కి తన జీవితం నచ్చకుండా వచ్చేసింది. హిజ్రాలలో కలసి పోవాలన్న ఆలోచన ఎక్కువైంది. దీంతో.., ఓ రోజు మహేశ్ ఎవ్వరికీ చెప్పకుండా, ఇంట్లో నుండి పారిపోయాడు.
కొడుకు ఇంట్లో నుండి ఎందుకు వెళ్లిపోయాడో తెలియక ఆ తల్లిదండ్రలకి కన్నీరు ఆగలేదు. తమ బిడ్డ జాడ కోసం రాష్ట్రాలకి రాష్ట్రాలే జల్లెడ వేశారు. కానీ.., మహేశ్ ఎక్కడ ఉన్నాడో తెలుసుకోలేకపోయారు. కానీ.., ఓనాడు బంధువులు వేములవాడలో మహేశ్ ని చూశారు. ఈ సమాచారాన్ని తల్లిదండ్రులకి చేరవేశారు. వారు ఆఘమేఘాల మీద వేములవాడలో వాలిపోయారు. అక్కడ తమ కొడుకు అవతారం చూసి మహేశ్ తల్లిదండ్రులు షాక్ అయిపోయారు.
మహేశ్ రూపం అప్పటికే పూర్తిగా మారిపోయింది. చీర కట్టుకుని, పూలు పెట్టుకుని, గాజులు వేసుకుని, పెద్ద బొట్టు పెట్టుకుని మహేశ్ భిక్షాటన చేసుకుంటూ కనిపించాడు. ఈ దృశ్యం చూసిన మహేశ్ పేరెంట్స్ గుండెలు బాదుకున్నారు. కొడుకుని తమతో పాటు ఇంటికి తీసుకెళ్లాలని ప్రయత్నించారు. మహేశ్ మాత్రం తాను ఇంటికి రాను అని మొండికేశాడు. చుట్టూ ఉన్న హిజ్రాలు కూడా మహేశ్ తల్లిదండ్రులను అడ్డుకున్నారు. కానీ.. పోలీసులు, బంధువుల సహాయంతో తల్లిదండ్రులు మహేశ్ ని తమతో పాటు ఇంటికి తీసుకెళ్లిపోవడం విశేషం.