ఆదాయం గురించి నెలలో ఒక్క రోజు వింటే, ఖర్చు అనే మాట నెలంతా వినాలి. జీతం పడే రోజు మాత్రమే ఈ రోజు జీతం వస్తుందిలే అనే భీమా ఉంటుంది. ఇక జీతం వచ్చినప్పటి నుంచి ఖర్చులే ఖర్చులు. పెరుగుతున్న నిత్యావసరాల ధరలకు తోడు ఈ కరోనా సమయంలో మధ్యతరగతి ప్రజలు భయపడుతుంది కరెంట్ బిల్ ఎంతొస్తుందో అని. కరెంట్ బిల్ చూసి షాక్ తినకుండా ఉండేందుకు కొన్ని చిన్న చిన్న ట్రిక్ పాటిస్తే తక్కువ బిల్‌తో బయటపడొచ్చు. అది ఎలాగో తెలుసుకోవాలంటే చదవండి.
1.తక్కువ విద్యుత్ అవసరమయ్యే బల్బులను వాడాలి. ఆర్డినరీ బల్బులతో పోల్చుకుంటే వీటితో 60 శాతం వరకు బిల్లు తగ్గించుకోవచ్చు.
2.చలికాలంలో వేడి నీళ్లతో స్నానం చేసేవారు గీజర్‌ను తరచూ ఆన్ చేయకుండా, ఒకే సారి నీటిని వేడి చేసుకుని ఒకరి తర్వాత ఒకరు వెంటవెంటనే స్నానం చేయాలి. థర్మోస్టాబ్ 50-60 డిగ్రీల సెంటీ గ్రేడ్ ఉంచాలి.
3.అవసరం లేనప్పుడు టీవీ, కంప్యూటర్‌ను ఆఫ్ చేయాలి. ఏసీ ఎప్పుడూ 25 డిగ్రీల్లో ఉంచాలి. దీంతో 40శాతం వరకు విద్యుత్ ఆదా అవుతుంది.
4.పాత కాలం ఫ్రిజ్‌ల వల్ల 160 యూనిట్ల వరకూ విద్యుత్ అవసరం అవుతుంది. అలా కాకుండా స్మార్ట్ ఫ్రిజ్‌లు అయితే అవసరానికి తగ్గట్టు పని చేస్తాయి. వీలైతే పాతవి అమ్మేసి కొత్త స్మార్ట్ ఫ్రిజ్‌లు కొనేయండి.
5.వాషింగ్ మెషీన్‌లో దాని సామర్థ్యానికి మించి బట్టలు వేయకుడదు. ట్రిప్పుకో జత ఊతికేందుకు మెషీన్‌ను ఆన్ చేయకూడదు.