ఓ వృద్ధురాలు ఉంటున్న చిన్న రేకుల షెడ్డుకి లక్ష రూపాయల కరెంట్ బిల్ వచ్చి ఆశ్చర్యానికి గురిచేసింది. రెండు బల్బులు, ఒక ఫ్యాన్ ఉన్న ఇంటికి మహా అయితే వంద రూపాయలో లేక వందకు పైగానో వచ్చే అవకాశం ఉంటది. కానీ లక్ష రూపాయల కరెంట్ బిల్ వచ్చి షాక్ కు గురి చేసింది.
కాలం మారింది దీంతో పాటుగా మనుషుల జీవన విధానంలో కూడా మార్పులు చోటుచేసుకున్నాయి. టెక్నాలజీ అభివృద్ధి చెందటంతో అనేకమైన ఎలక్ట్రానిక్ పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. వాటి సాయంతో ఎలాంటి పనులైన సులువుగా జరిగిపోతున్నాయి. ముఖ్యంగా ఇళ్లలో ఎసిలు, ఫ్రిజ్ లు, కూలర్లు, వాషింగ్ మిషన్లు నిత్యావసరంగా మారిపోయాయి. వీటి వినియోగంతో విద్యుత్ వినియోగం కూడా ఎక్కువై పోయింది. దీంతో కరెంట్ బిల్ కూడా అధికంగా వస్తుంది. కానీ అక్కడ మాత్రం ఓ వృద్ధురాలు ఉంటున్న చిన్న ఇంటికి, అందులో రెండు లైట్లు మాత్రమే ఉన్న ఇంటికి లక్ష రూపాయల కరెంట్ బిల్ వచ్చి షాక్ కు గురిచేసింది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
ప్రస్తుత రోజుల్లో కరెంట్ లేకుండా గడపడమంటే చాలా కష్టం. పల్లె నుంచి నగరాల వరకు విద్యుత్ వినియోగం పెరిగిపోయింది. అయితే అప్పుడప్పుడు విద్యుత్ వాడకానికి సంబంధించి వచ్చే కరెంట్ బిల్లుల్లో టెక్నికల్ సమస్యలతో గాని, విద్యుత్ అధికారుల తప్పిదాలతో గాని వేలు, లక్షల్లో బిల్ వచ్చి షాక్ ఇస్తుంటాయి. ఆ తరువాత ఆ వినియోగదారుడు అధికారుల చుట్టూ తిరిగి ఆ సమస్య నుంచి పరిష్కారం పొందుతారు. కర్ణాటక రాష్ట్రంలో కూడా అలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఓ వృద్ధురాలు ఉంటున్న ఇంటికి లక్షరూపాయల కరెంట్ బిల్ వచ్చింది. వివరాల్లోకి వెళ్తే..
కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికల సందర్భంగా ఉచిత విద్యుత్ వంటి హామీలను ఇస్తుంటాయి ప్రభుత్వాలు. నిరుపేదలకు కరెంట్ అందించాలనే సంకల్పంతో పనిచేస్తుంటాయి. ఇదే రీతిలో కర్ణాటకాలో భాగ్య జ్యోతి పథకాన్ని తీసుకు వచ్చింది అక్కడి ప్రభుత్వం. ఈ పథకం కింద మహళలకు ఉచితంగా విద్యుత్ కనెక్షన్ ఇచ్చారు. ఆ భాగ్య జ్యోతి పథకం కింద ఓ 96 ఏళ్ల వృద్ద మహిళ తన చిన్న రేకుల షెడ్ ఇంటికి విద్యుత్ కనెక్షన్ పొందింది. ఆ ఇంట్లో రెండు ఎల్ఈడి లైట్స్, ఒక ఫ్యాన్ మాత్రమే ఉన్నాయి. కాగా మే నెలకు సంబంధించి కరెంట్ బిల్ వచ్చింది. ఆ చిన్న రేకుల షెడ్ ఇంటికి వంద రూపాయల లోపు కరెంట్ బిల్ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ లక్షరూపాయల కరెంట్ బిల్ వచ్చింది. దీంతో ఆ మహిళ షాక్ కు గురైంది. విషయాన్ని విద్యుత్ అధికారుల దృష్టికి తీసుకెళ్లగా వారు విచారించి మీటర్ లో టెక్నికల్ సమస్య ఉందని, రీడింగ్ తప్పుగా నమోదయ్యిందని తెలిపారు. ఆ బిల్ ను తనను కట్ట వద్దని, తాము దానిని సరి చేస్తామని హామీ ఇచ్చినట్లు ఆ వృద్దురాలు తెలిపింది.