ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారిధిల ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారు. అందుకే ప్రజల నుంచి ప్రభుత్వానికి రావాల్సిన డబ్బులను వసూలు చేస్తుంటారు. అదే విధంగా చాలా మంది ప్రజలకు కూడా ప్రభుత్వానికి చెల్లించాల్సిన పనులను చెల్లిస్తుంటారు. కానీ కొందరు మాత్రం ఉద్యోగులపై దాడులకు దిగితుంటారు.
ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారిధిల ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారు. అందుకే కొందరు ప్రభుత్వ పథకాలను ప్రజల వద్దకు తీసుకెళ్తుంటే, మరికొందరు ఉద్యోగులు ప్రజల నుంచి ప్రభుత్వానికి రావాల్సిన డబ్బులను వసూలు చేస్తుంటారు. అంటే బ్యాంకు రుణాలు, విద్యుత్ బిల్లు, ఇతర పన్నులను ప్రజల నుంచి వసూలు చేస్తుంటారు. అదే విధంగా చాలా మంది ప్రజలకు కూడా ప్రభుత్వానికి చెల్లించాల్సిన పనులను చెల్లిస్తుంటారు. కానీ కొందరు మాత్రం ఉద్యోగులపై దాడులకు దిగితుంటారు. తాజాగా ఇలాంటి ఘటన ఒకటి కర్ణాటకలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
కర్ణాటక రాష్ట్రంలోని ఓ ప్రాంతంలో విద్యుత్ ఉద్యోగిపై చంద్రశేఖర్ అనే వ్యక్తి దాడి చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియో ప్రకారం.. ఓ వ్యక్తి ఇంటి వద్దకు ఇద్దరు విద్యుత్ ఉద్యోగులు వెళ్లారు. అతడిని కరెంట్ బిల్లు కట్టమని అడిగారు. దీంతో అతడు నేను కట్టను అంటూ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. బిల్లు కట్టకుంటే మీకే ఇబ్బందని విద్యుత్ ఉద్యోగులు తెలిపారు. అయితే నేను కట్టను ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ వారిలో ని ఓ వ్యక్తి చెంపపై కొట్టాడు.
సదరు ఉద్యోగి చేతులు అడ్డుగా పెట్టుకున్న కూడా సదరు వ్యక్తి తీవ్రంగా దాడి చేశాడు. అలానే ఈ ఘటనను వీడియో తీస్తున్న మరో ఉద్యోగిపై కూడా సదరు వ్యక్తి దాడి చేసే ప్రయత్నం చేశాడు. అతడితో పాటు ఆ కుటుంబంలోని మహిళలు కూడా ఉద్యోగులతో వాగ్వాదానికి దిగారు. మరోసారి అతడితో మాట్లాడేందుకు ఉద్యోగి ప్రయత్నించగా.. అప్పుడు కూడా దాడి చేశాడు. చివరకు ప్రభుత్వ ఉద్యోగులపై దాడికి దిగితావా? నీపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తామని ఉద్యోగులు తెలిపారు. ఏం చేసుకుంటారో, చేసుకోండి అంటూ ధిక్కార స్వరంతో సదరు వ్యక్తి మాట్లాడాడు.
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది. అలానే ఉద్యోగులపై దాడి చేసిన చంద్రశేఖర్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. అలానే ఈ ఘటనపైనెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. కరెంట్ బిల్లు కట్టమన్నందుకే ఉద్యోగులపై దాడులు చేయడం సరైనది కాదంటూన్నారు. అలానే ప్రభుత్వ ఉద్యోగులకు రక్షణ కరవైందంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరి.. బిల్లు కట్టమన్నందుకు ఉద్యోగిపై దాడి చేసిన వ్యక్తి ఏలాంటి శిక్ష విధించాలి.. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Police case registered against a consumer in #Koppal district after he
refuses to pay bills & attacked #GESCOM official.#Munirabad police take up the case#ElectricityBill #Karnataka #india #viral #viralvideo pic.twitter.com/lkH14vumBb— Siraj Noorani (@sirajnoorani) May 24, 2023