ఫిల్మ్ డెస్క్- గీతా మాధురి తెలుసు కదా.. ఈ ప్లేబ్యాక్ సింగర్ ఏ విషయాన్నైనా కుండ బద్దలు కొట్టినట్లు చెప్పేస్తుంది. అది కెరీర్ కు సంబందించినదైనా, పర్సనల్ విషయం అయినా సరే. తనకు సంబందించిన అన్ని విషయాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పంచుకుంటుంది గీతా మాధురి. తాజాగా తాను మరో బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లు పరోక్షంగా చెప్పింది గీతా.
బిగ్ బాస్ ఉత్సవం పేరిట ఓ ఈవెంట్ రాబోతున్న సంగతి తెలిసిందే. ఇందులో ఐదు సీజన్ల కంటెస్టెంట్లు పాల్గొనబోతున్నారు. దీని కోసం అన్ని సీజన్ల కంటెస్టెంట్లు పాల్గొన్నట్టు తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా ఈవెంట్‌కు సంబంధించిన షూటింగ్ జరుగుతోంది. తాజాగా ఈ షూటింగ్ లొకేషన్ లో సింగర్ గీతా మాధురి, అరియానా సరదాగా మాట్లాడుకున్నారు.
ఈ సందర్బంగా అరియానా, గీతా మాధురిని కొన్ని ప్రశ్నలు అడిగింది. గీతా మాధురి ఏ మాత్రం తడుము కోకుండా సమాధానాలు చెప్పింది. ఈ క్రమంలో రెండో సారి తాను తల్లిని అయ్యేందకు సిద్దంగా ఉన్నట్లు చెప్పింది. నా బుగ్గలు ఎందుకు ఉబ్బాయంటే ఐదు రోజులు పది గంటల పాటు పడుకున్నా, అందుకే ఉబ్బాయి.. అని గీతా మాధురి చెప్పింది.
అందుకు..గుడ్ న్యూస్ ఏం లేదా.. అని అరియానా అడిగింది. గుడ్ న్యూస్ వంటిది ఏం లేదు.. ఛీ ఛీ ఈ క్షణానికి లేదు.. ఏ క్షణానికి ఏమైనా జరగొచ్చు.. అని గీతా మాధురి ఆచెప్పుకొచ్చింది. ఎప్పుడో వచ్చే ఆ క్షణానికి ఇప్పుడు కంగ్రాట్స్ అని అరియానా అంది. ఒక వేళ విశేషం ఉంటే సిక్స్త్, సెవెన్త్ మంథ్ లో చెబుతాను.. తప్పకుండా ఉంటుంది.. తథాస్తు అని గీతా మాధురి బదులిచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.