ఫిల్మ్ డెస్క్- శ్రియ శరన్, ఆమె భర్త ఆండ్రూ ఎంత రోమాంటిక్ కపుల్ అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇంటా, బయట ఎక్కడ ఉన్నా ప్రేమగా, సరసాలు ఆడుతూ బాగా ఏంజాయ్ చేస్తుంటారు. శ్రియ, ఆండ్రూల రొమాంటిక్ ఫోటోలు , వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంటాయి. తాజాగా ఈ అందమైన జంట అందరి ముందు ముద్దులతో పిచ్చెక్కించేసింది.
శ్రియ తన భర్త ఆండ్రూను సోషల్ మీడియాలో చుపించడమే తప్ప, ఇప్పటి వరకు ప్రత్యక్షంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాలేదు. ఈ క్రమంలో తొలిసారి భర్త ఆండ్రూతో కలిసి జీ తెలుగు ఈవెంట్లో కనిపించింది ఈ ముద్దుగుమ్మ. ఎంతో అట్టహాసంగా జరగబోతోన్న జీ తెలుగు కుటుంబం అవార్డ్స్ వేడుకలో శ్రియ తన భర్త ఆండ్రూతో కలిసి సందడి చేసింది. ఒక్కసారిగా శ్రియ స్టేజ్ మీద ఉన్నవారందరికి జలక్ ఇచ్చింది.
శ్రియ, ఆమె భర్త ఆండ్రూకు జీ తెలుగు చాలా గ్రాండ్ గా గ్రాండ్గా స్వాగతం చెప్పింది. ఇంగ్లీష్ తప్ప మరే భాష రాని ఆండ్రూ సైతం తెలుగులో మాట్లాడి అందరిని ఆశ్చర్యపరిచాడు. అందరికీ నమస్కారం అని చెప్పి అందరిని ఆకట్టుకున్నాడు. తన భర్త ఆండ్రూ అలా తెలుగులో మాట్లాడటంతో శ్రియా ఒక్కసారిగా షాక్ అయ్యింది. ఇదిగో ఈ సమయంలో సోషల్ మీడియాలో మీరు ఎలా పోజులు పెడతారు అలా ఓ ఫోజ్ ఇవ్వండని వాళ్లను కోరాడు.
ఈ క్రమంలో శ్రియ బుగ్గ మీద ఆమె భర్త ఆండ్రూ ముద్దు పెట్టేశాడు. అలా భర్త ప్రేమగా ముద్దు పెడితే శ్రియ మాత్రం ఊరుకుంటుందా చెప్పండి. వెంటనే శ్రియా ఏకంగా భర్త ఆండ్రూకు ఇంగ్లీష్ కిస్ పెట్టేసింది. అలా భర్త పెదవికి పెదవితో ముద్దు పెట్టడంతో అక్కడున్న వారంతా నోరెళ్లబెట్టారు. అమ్మో శ్రియ తక్కువదేం కాదురాబాబు అంటూ బుల్లితెర తారలు కామెంట్ చేశారు.