ఓ దశాబ్దాల కాలం పాటు సినిమా పరిశ్రమను ఏలుతున్న నటీమణులు చాలా అరుదుగా ఉంటారు. అందులోనూ పెళ్లైతే ఇక హీరోయిన్లకు కెరీర్ ముగినట్లే. కానీ ఈ అవరోధాలను దాటుకుంటూ.. ఇంకా హీరోయిన్‌గా రాణిస్తున్నారు శ్రియ. పెళ్లై, పిల్లలున్నా ఆమెలో ఇసుమంతైనా అందం తగ్గలేదు. తాజాగా
సినీ పరిశ్రమలో హీరోయిన్లుగా కొనసాగే కాలం చాలా తక్కువ ఉంటుంది తారామణులకు. ఓ సినిమా హిట్ కొట్టిందంటే.. రెండు, మూడేళ్లు కాల్షీట్లు నిండిపోతాయి. లేదంటే ఆ ఒక్క సినిమాకే ఇంటికి దారి పట్టిన హీరోయిన్లు ఎంతో మంది ఉన్నారు. హిట్ కొడితే కొంత కాలం సినీ పరిశ్రమలో కొనసాగుతుంటారు. కానీ ఓ దశాబ్దాల కాలం పాటు సినిమా పరిశ్రమను ఏలుతున్న నటీమణులు చాలా అరుదుగా ఉంటారు. అందులోనూ పెళ్లైతే ఇక హీరోయిన్లకు కెరీర్ ముగినట్లే. కానీ ఈ అవరోధాలను దాటుకుంటూ.. ఇంకా హీరోయిన్‌గా రాణిస్తున్నారు శ్రియ. పెళ్లై, పిల్లలున్నా ఆమెలో ఇసుమంతైనా అందం తగ్గలేదు. అందుకే ఆమెకు ఇంకా అవకాశాలు వరుస కడుతున్నాయి. అయితే ఆమె ఓ మీడియా సమావేశంలో పలు వ్యాఖ్యలు చేశారు.
శ్రియ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం మ్యూజిక్ స్కూల్. యామిని ఫిలిమ్స్ పతాకంపై పాపారావు బియ్యాల స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. బై లింగ్వల్ మూవీగా ఈ చిత్రం తెరకెక్కింది. శర్మన్ జోషి, నటి లీలా సామ్సన్ ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతాన్ని అందించారు. తెలుగు, హిందీ భాషల్లో రూపొందిన ఈ చిత్రం తమిళంలో కూడా అనువాద చిత్రంగా ఈనెల 12న తెరపైకి రానుంది. ఈ సందర్భంగా చిత్రం యూనిట్ గురువారం చైన్నెలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ‘ ఇది ఈ తరం విద్యార్థులు చూడాల్సిన ముఖ్యమైన చిత్రం. చదువు, పరీక్షలు అంటూ విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. దీంతో కొందరు ఆత్మహత్యలకు కూడా పాల్పడుతున్నారు. అందుకు కారణం మానసిక ప్రశాంతత లేకపోవడమే’దర్శక, నిర్మాత పాపారావు అన్నారు. ఈ చిత్రం కోసం లండన్ వెళ్లి సంగీతం గురించి పరిశోధన చేసినట్లు తెలిపారు.
శ్రియ మాట్లాడుతూ ఈ సినిమా షూటింగ్ కు వెళ్తున్న సేపు సొంతింటికి వెళుతున్న భావన కలిగిందన్నారు. ఈ సినిమాను తాను మనస్సు పెట్టి చేసినట్లు చెప్పారు. భవిష్యత్తులో ఈ సినిమాను తన కూతురు రాధ చూస్తే గర్వంగా ఫీలవుతుందని అన్నారు. పిల్లల మీద ఓవర్ ఎక్స్ పెక్టేషన్ తో తల్లిదండ్రులు ఒత్తిడి పెడుతున్నారన్నారు. తాను ఓ మంచి తల్లిదండ్రులను కలిగి ఉన్నానని, అందుకే తాను ఏది చేయాలనుకుంటే అది చేశానని అన్నారు. తన బంధువుల్లో కొందరు ఇంటి నుండి బయటకి రావడానికే చాలా పోరాటం చేయాల్సిన పరిస్థితి ఉందని, వారు ఆడుకోవడానికి వెళ్లడానికి కూడా అడగాల్సి వచ్చేదన్నారు. కానీ తనకు అలాంటివి లేవని చెప్పారు. ఈ చిత్ర కథ వినగానే అలాంటి విషయాలను అర్థం చేసుకోగలిగానన్నారు. ఇది ఈ తరానికి కావాల్సిన సినిమా అని పేర్కొన్నారు. దర్శకుడు పాపారావు చిత్రాన్ని చాలా అద్భుతంగా ఆవిష్కరించారని చెప్పారు.