ఫిల్మ్ డెస్క్- ఈ మధ్యకాలంలో సినిమా పాటలకు సమాన్యుల నుంచి మొదలు సెలబ్రిటీల వరకు స్టెప్పులు వేయడం సర్వసాధారణం అయిపోయింది. తమకు నచ్చిన సాంగ్స్ కు డ్యాన్స్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు చాలా మంది సినీ, క్రీడా ప్రముఖులు. ఈ క్రమంలోనే ఇన్ స్టాగ్రాంలో ఇప్పుడు రీల్ వీడియోల ట్రెండ్ నడుస్తోంది.
అందులోను బుల్లితెర తారలు షూటింగ్ గ్యాప్ లో రీల్ వీడియోలు చేస్తూ హల్ చల్ చేస్తున్నారు. ట్రెండింగ్ పాటలకు రకరకాల స్టెప్పులు వేసి అందరిని అలరిస్తున్నారు. ఆ మధ్య సామీ సామీ అంటూ రష్మిక వేసిన రీల్ వీడియో స్టెప్పులు బాగానే వైరల్ అయ్యాయి. తాజాగా అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్ గా వచ్చిన రౌడీ బాయ్స్ సినిమాలోని ఓ పాట ఫుల్ ట్రెండ్ అవుతోంది. బృందావనం నుంచి కృష్ణుడు వచ్చాడే.. అంటూ సాగిన ఆ పాట నెట్టింట్లో ఫుల్ వైరల్ గా మారింది.
మరీ ముఖ్యంగా అమ్మాయిలు అయితే ఈ పాటకు కొన్ని వేల రీల్ వీడియోలు చేస్తున్నారు. ఇక ఇప్పుడు కూడా ఈ పాట ఇంకా ట్రెండింగ్ లోనే ఉంది. ఈ పాటకు ప్రముఖ కొరియేగ్రాఫర్ శేఖర్ మాస్టర్ డ్యాన్స్ కంపోజ్ చేశారు. ఇంత మంచి పాటను ఇచ్చినందుకు మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్ కు, నాతో ఇలా డ్యాన్స్ చేయించినందుకు శేఖర్ మాస్టర్‌కు థ్యాంక్స్ అంటూ అనుపమ ఎగ్జైట్ అయ్యింది.
తాజాగా ఈ పాటకు శేఖర్ మాస్టర్ కూతురు సాహితీ డ్యాన్స్ చేసింది. సాహితీ వేసిన స్టెప్పులకు కూడా అనుపమ తన ఇన్ స్టా స్టోరీలో షేర్ చేసింది. తన కూతురు సాహితీ వేసిన స్టెప్పులపై శేఖర్ మాస్టర్ స్పందించారు. అడొరబుల్.. అంటూ శేఖర్ మాస్టర్ కామెంట్ చేయగా, థ్యాంక్స్ అంటూ సాహితీ రిప్లై ఇచ్చింది. క్యూట్ అని అనుపమ కామెంట్ చేసింది. శేఖర్ మాస్టర్ కూతురు సాహితీలోని గ్రేస్ చూసి నెటిజన్స్ ఫిదా అవుతున్నారు.