ఫిల్మ్ డెస్క్- సల్మాన్ ఖాన్.. బాలీవుడ్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్. చాలా మంది హీరోయిన్లతో ప్రేమలో పడ్డ సల్మాన్.. ఇప్పటి వరకు పెళ్లి మాత్రం చేసుకోలేదు. ఎప్పటికప్పుడు సల్మాన్ పెళ్లి అంటూ బాలీవుడ్ లో గుసగుసలు వినిపించడమే కాని పెళ్లి మాత్రం జరగలేదు. సల్మాన్ ఖాన్ పెళ్లి, రిలేషన్షిప్స్, డేటింగ్ల గురించి ఎప్పడూ సినిమా ఇండస్ట్రీలో చర్చ జరుగుతూనే ఉంటుంది. ఇలాంటి వార్తలపై చాలా వరకు మౌనంగానే ఉంటారు సల్మాన్.
ఐతే తాజాగా సల్మాన్ ఖాన్ పెళ్లిపై ఓ వార్త బాలీవుడ్ లో చక్కర్లు కొడుతోంది. సల్మాన్ ఖాన్ కు పెళ్లైందని, భార్య తో పాటు17 ఏళ్ల కూతురు కూడా ఉందనే ప్రచారం డరుగుతోంది. అంతే కాదు సల్మాన్ భార్యా, కూతురు దుబాయ్లో ఉంటున్నారని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. దీంతో సల్మాన్ అభిమానులంతా ఆయన భార్య, కూతురు గురించి నెట్ లో వెతకడం మొదలుపెట్టారు.
తన పెళ్లి, భార్య, కూతురు గురించి జరుగుతున్న ప్రచారంపై సల్మాన్ ఖాన్ ఎట్టకేలకు స్పందించారు. సల్మాన్ సోదరుడు అర్బజ్ ఖాన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న పించ్ టాక్ షోకు అతిధిగా వచ్చిన సల్మాన్ పెళ్లిపై నోరు విప్పారు. ఇటీవల ఓ నెటిజన్ మీకు దుబాయ్లో భార్య, 17 ఏళ్ల కూతురు ఉన్నారని ఆరోపిస్తూ ట్వీట్ చేశారు. అది నిజమా.. అని ఓ అభిమాని అడిగారు. దీనిపై స్పందించిన సల్మాన్.. జనాలకు ఇలాంటి సమాచారం ఎలా అందుతుందో నాకు తెలీదు.. ఇలాంటి చర్చల వల్ల ఏ ఉపయోగం లేదు..
దీని వల్ల వారికి ఏం కలిసొస్తుందో నాకు ఐడియా లేదు.. ఈ కామెంట్లు చేసిన వ్యక్తుల పేర్లు నా నోట చెప్పించే ప్రయత్నం కావచ్చు.. వారి ప్రచారం కోసం కొందరు రాసే రాతలివి.. తొమ్మిదో సంవత్సరం నుంచి నేను ముంబైలోనే ఉంటున్నా.. నాన్న కూడా నాతోనే ఉంటున్నారు.. ఈ విషయం అందరికీ తెలిసిందే.. అని చెప్పుకొచ్చారు. సో.. సల్మాన్ ఖాన్ కు ఇంకా పెళ్లి కాలేదని తేలిపోయింది.