ఫిల్మ్ డెస్క్- ఈ రోజు మధర్స్ డే తో పాటు అందాల తార సాయి పల్లవి పుట్టిన రోజు. ఈ సందర్బంగా ఆమె నటిస్తున్న శ్యామ్ సింగరాయ్ సినిమా నుంచి సాయి పల్లవి లుక్ రిలీజ్ చేసింది యూనిట్. ఈ ఫస్ట్ లుక్‌లో సాయి పల్లవి త్రిశూలం పట్టుకొని పవర్‌ఫుల్‌గా కనిపిస్తోంది. సాయి పల్లవి ఈ లుక్ ను పరిశీలిస్తే భారీ సంఖ్యలో జూనియర్ ఆర్టిస్టులతో అమ్మవారి పండుగ సంబరాలు జరిగే నేపథ్యంలో తెరకెక్కించిన పాటలోనిదని అర్దమవుతోంది. నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో ఉప్పెన ఫేమ్ కృతిశెట్టి కూడా నటిస్తోంది. కృతి శెట్టి సెకండ్ హీరోయిన్ గా యాక్ట్ చేస్తోంది.
ఈ సినిమాలో సాయి పల్లవి క్యారెక్టర్ పవర్ ఫుల్ గా ఉండబోతోందట. రాహుల్ సంకృత్యన్ శ్యామ్ సింగరాయ్ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నిర్మాత వెంకట్ బోయినపల్లి భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కోల్కత్తా సిటీ నేపధ్యంలో శ్యామ్ సింగరాయ్ సినిమా రూపొందుతోంది. ఇక ఈ సినిమాను ఇదే సంవత్సరం ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఐతే కరోనా పరిస్థితులను బట్టి సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించనున్నారు.