ఫిల్మ్ డెస్క్- రోజా.. ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్. ఇప్పుడు రాజకీయాలతో పాటు, జబర్దస్త్ లాంటి టీవీ షోలు చేస్తోంది. అడపా దడపా సినిమాల్లో కారెక్టర్స్ కూడా చేస్తోంది రోజా. ఏపీలోని నగరి ఎమ్మెల్యేగా గెలిచిన రోజా అటు రాజకీయాలను, ఇటు టీవీ షోలను బాగానే బ్యాలెన్స్ చేస్తోంది. ఇక రోజా గురించిన ఆసక్తికరమైన విషయాలు ఏంటంటే రోజా కెరీర్ కొత్తలో తన భర్త వల్లే ఆర్ధికంగా బాగా నష్టపోయింది.
రోజా భర్త సెల్వమణి దర్శకుడిగా పలు సినిమాలు చిత్రీకరించారు. ఆయన చెంబరుతి సినిమా ద్వారా తమిళ ఇండస్ట్రీకి డైరెక్టర్ గా పరిచయమైయ్యారు. ఈ సినిమాలో ప్రశాంత్ హీరోగా నటించగా, రోజా హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా తమిళ చిత్ర పరిశ్రమలో మంచి విజయాన్ని సాధించడంతో, సెల్వమణికి మంచి గుర్తింపు వచ్చింది. ఈ సమయంలోనే సెల్వమణి, రోజా మధ్య పరిచయం ఏర్పడి ప్రేమకు దారి తీసింది. రోజా, సెల్వమణి 2002లో వివాహం చేసుకున్నారు.
నిజానికి సెల్వమణి రోజాను ప్రేమించిన విషయాన్ని ముందుగా రోజాకు కాకుండా అమె తండ్రి దగ్గరకు వెళ్లి చెప్పారట. అలా సెల్వమణి ముందుగా రోజా తండ్రిని ఒప్పించి, ఆ తర్వాత రోజాకు తన ప్రేమ విషయం విషయం చెప్పారు. రోజా కూడా సెల్వమణి ప్రేమ కోసం చాలా కష్టాలు పడిందని అంటారు. సెల్వమణి కోసం తమిళం మాట్లాడటం, చదవడం కూడా నేర్చుకుందట రోజా. 1994లో సమరం అనే ఓ యాక్షన్ డ్రామా ఎంటర్టైనర్ సినిమాలో నటించింది రోజా.
ఈ సినిమాలో రోజా తో పాటు సుమన్, రాసిన్ రెహమాన్ తదితరులు నటించారు. ఈ చిత్రానికి ఆర్ కె సెల్వమణి దర్శకత్వం వహించారు. ఈ సినిమాను శ్రీ సాయిరోజా ప్రొడక్షన్స్ పై స్వయంగా రోజా నిర్మించారు. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా ఈ చిత్రానికి స్వరాలు సమకుర్చారు. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోరంగా ప్లాప్ అయ్యింది. దీంతో రోజా పూర్తిగా నష్టపోయిందట. అప్పటి వరకు హీరోయిన్ గా నటించి సంపాదించుకున్నదంతా ఈ ఒక్క సినిమాతో పోగొట్టుకుని ఆర్ధిక కష్టాల్లో పడిందట. ఆలా పెళ్లికి ముందే సెల్వమణి వల్ల రోజా ఆర్దికంగా నష్టపోయిందన్న మాట.