నందమూరి బాలకృష్ణ.. మాస్ లో ఈ పేరుకి ఉండే క్రేజ్ మాటల్లో చెప్పేది కాదు. జయాపజయాలతో సంబంధం లేకుండా, స్క్రీన్ పై బాలయ్య కనిపిస్తే.. పూనకాలతో ఊగిపోయే ఫ్యాన్స్ కోట్లలో ఉన్నారు. కానీ.., బాలయ్య అంటే కేవలం రీల్ హీరో మాత్రమే కాదు. ఆయనలో ఓ రియల్ హీరో కూడా ఉన్నాడు. తన తల్లిగారి పేరు మీద బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ స్థాపించి.. ఆయన ఇప్పటి వరకు ఎన్ని వేల మంది ప్రాణాలను కాపాడారో లెక్కే లేదు. ఇక ఇండస్ట్రీలో ఎవరికైనా, ఎప్పుడైనా ఆపద వస్తే.. ఆయనకి ఒక్క ఫోన్ చేస్తే చాలు. కష్టం వాళ్ళ కాంపౌండ్ వాల్ తాకకుండా అడ్డుపడిపోతాడు. కొన్నిసార్లు ఆయన మాటలు పైకి కటువుగా అనిపించినా, బాలయ్య మనసు మాత్రం బంగారం. తాజాగా యాంకర్ ప్రదీప్ ఇందుకు సాక్ష్యంగా నిలిచే ఓ విషయాన్ని బయటపెట్టాడు.
ప్రదీప్.. ప్రస్తుతం ‘డ్రామా జూనియర్స్ – ద నెక్ట్స్ సూపర్ స్టార్’ అనే షోకి హోడ్ట్ గా వ్యవహరిస్తున్నాడు. ఈ షోలో భాగంగా జూనియర్ బాలకృష్ణ పేరొందిన ప్రజ్వల్.. బాలయ్యని అనుకరిస్తూ ఓ స్కిట్ చేశాడు. ఇందులో భాగంగా ఆడవారికి కష్టం వస్తే బాలయ్య ఎలా రియాక్ట్ అవుతాడో స్కిట్ లో తెలియచేశాడు. దీంతో.., స్టేజ్ అంతా జై బాలయ్య, జై జై బాలయ్య అనే నినాదాలతో హోరెత్తి పోయింది. ఇదే సమయంలో స్టేజ్ పై బాలయ్య కటౌట్‌ను ప్రదర్శించారు. సరిగ్గా.., ఇక్కడే యాంకర్ ప్రదీప్ కాస్త ఉద్వేగానికి లోనయ్యాడు. బాలయ్య రియల్ క్యారెక్టర్ ని బయటపెట్టాడు.
“బాలకృష్ణ స్టైల్, ఆయన తీరు ఎప్పుడూ సింహం లాగే ఉంటుంది. క్యాన్సర్ ఆస్పత్రిలో కానీ, ఎక్కడైనా కానీ హెల్ప్ కావాలంటే ఫస్ట్ ఫోన్ కాల్ నేను చేసేది బాలయ్య బాబు గారికే. అప్పటికప్పుడు కాల్స్ చేసి ఎంతో మందికి ఆయన ట్రీట్‌మెంట్ చేయించారు. ప్రదీప్ ఓ మంచి పని కోసం అర్ధరాత్రైనా సరే నాకు ఫోన్ చెయ్. ఎలాంటి మొహమాట పడకు అన్నారాయన. ఆ ఒక్క మాట చాలు, ఆయనిచ్చిన ధైర్యం చాలు” అని బాలయ్య రియల్ క్యారెక్టర్ బయటపెట్టారు ప్రదీప్. ప్రదీప్ తో పాటు.., జడ్జ్ అలీ కూడా బాలయ్య మనసులో ఉన్నది బయటకి మాట్లాడే స్వచ్ఛమైన మనిషి తెలియచేశాడు. దీంతో.., ప్రేక్షకులు అంతా జై బాలయ్య అంటూ.. స్టేజ్ ని ఒక ఊపు ఊపేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఎపిసోడ్ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి.. చూశారు కదా? బాలయ్య రియల్ క్యారెక్టర్ ఎంత గొప్పదో? ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.