ఫిల్మ్ డెస్క్- నాచురల్ స్టార్ నాని తాజాగా నటించిన సినిమా టక్ జగదీష్. చాలా రోజుల క్రితమే షూటింగ్ పూర్తి చేసుకున్నా, కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఎప్పటికపపుడు విడుదల వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా ఎట్టకేలకు రిలీజ్ కు సిద్దమైంది. వినాయక చవితి పండగను పురస్కరించుకుని ఈ నెల 10న అమెజాన్ ప్రైమ్ వేదికగా టక్ జగదీష్ మూవీ విడుదల అవుతోంది.
ఇక ఈ సినిమాకు సంబందించి శుక్రవారం విదుదలైన ‘సల్లాటి కుండలో.. సల్ల సక్క మనసువాడు’ పాటకు ఆడియన్స్ లో మంచి క్రేజ్ వస్తోంది. టక్ జగదీష్ సినిమా కోసం దర్శకుడు శివ నిర్వాణ తొలిసారి గొంతు సవరించుకున్నారు. ఈ సినిమాలో నాని క్యారెక్టర్ తెలియజేేసలా చిత్రీకరించిన.. సల్లాటి కుండలో.. సల్ల సక్క మనసువాడు.. పాటను డైరెక్టర్ శివ ఆలపించారు. అచ్చం రాయలసీమ యాసలో సాగే ఈ పాటను చిత్ర బృందం శుక్రవారం విడుదల చేసింది.
ఐతే ముందు ఈ పాటను హీరో నానితో పాడించాలని డైరెక్టర్ శివ అనుకున్నారట. కానీ పాటను ఎలా పాడాలో దర్శకుడు వివరించిన తీరు నానికి బాగా నచ్చింది. అంతే ఇంకేం ఆలోచించకుండా మీరే ఈ పాటను పాడండి అని దర్శకుడు శివ చేత పాటను పాడించారట నాని. అంతే వెంటనే గొంతు సవరించుకుని.. సల్లాటి కుండలో.. అటూ పాడేశారు. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతోంది.
అన్నట్లు టక్ జగదీష్ సినిమాలో రీతు వర్మ, ఐశ్వర్యా రాజేశ్ లు నానికి జోడీగా నటించారు. షైన్ స్ర్కీన్ పతాకంపై సాహు గారపాటి, హరీశ్ పెద్ది ఈ సినిమాను నిర్మించారు. తాజాగా రిలీజ్ అయిన సల్లాటి కుండలో పాటకు గోపీసుందర్ స్వరాలు అందించారు. మరింకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ పాటను విని ఎంజాయ్ చేయండి.
Oppinchesaam 😄
Convinced @ShivaNirvana to sing this one. His jagadish naidu in his voice and words 🤍#TuckSong https://t.co/mkgibGTv8T@GopiSundarOffl pic.twitter.com/NSxarAncwy
— Nani (@NameisNani) September 3, 2021