టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్‌సింగ్ ఇండస్ట్రీకి కొత్తగా వచ్చేవారి కోసం ప్రత్యేకంగా ఒక యాప్‌ను లాంచ్ చేసింది. ‘స్టారింగ్ యూ’ పేరుతో తన తమ్ముడు అమన్ ప్రీత్‌సింగ్‌తో కలిసి రకుల్ ఈ కొత్త ఐడియాకు శ్రీకారం చుట్టింది. సినీ పరిశ్రమపై కొన్ని వేల మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడి జీవిస్తుంటారు. కానీ చాలామంది అవకాశాలు అంత ఈజీగా రావు. అసలు ఎక్కడ అవకాశాలు ఉన్నాయన్న విషయం కూడా సరిగా తెలియవు. ఈ సమస్యను తీర్చాడానికే ఈ యాప్ రూపొందించినట్లు రకుల్ తెలిపింది.
సినీ రంగంలో తెరపై కనిపించే వారే కాకుండా తెర వెనుక సినిమా కోసం పని చేసే వారు చాలా మంది ఉంటారు. అక్కడ ఉద్యోగ అవకాశాలు కూడా చాలా ఉంటాయి. అలా ఉన్న ఉద్యోగ వివరాలను తన యాప్‌లో పొందుపర్చి.. అవకాశాల కోసం చూస్తున్నవారికి అందించేందుకు ఈ యాప్ ఉపయోగపడుతుందని రకుల్ పేర్కొన్నారు. అలాగే ఈ యాప్ సేవలను ఉచితంగా అందించనుండడం విశేషం. ఈ యాప్ ద్వారా అవకాశాలు, ఉద్యోగాల కోసం చూసేవారికి, అలాగే మంచి టాలెంట్ కోసం వెతుకుతున్న సంస్థలకు కూడా ఉపయుక్తంగా ఉంటుందని ఈ యాప్ ఫౌండర్ అమన్ ప్రీత్‌సింగ్ తెలిపారు. ఈ యాప్ బాధ్యతలను అమన్ చూసుకోనున్నారు.
లాక్‌డౌన్ సమయంలో చాలా రంగాలు నడచిప్పటికీ సినీ రంగం మాత్రం తీవ్ర గడ్డుపరిస్థితిని ఎదుర్కొందని, ఆ సమయంలోనే తమకు ఈ ఆలోచన వచ్చినట్లు రకుల్ తెలిపింది. ఈ యాప్ ద్వారా ఎవరైనా, ఎక్కడినుంచైనా.. ఆన్‌లైన్‌లో ఆడిషన్స్ జరపవచ్చని, పాల్గొనవచ్చిని తెలిపారు. ఈ యాప్ సేవలు బాలీవుడ్‌తో పాటు పంజాబీ, గుజరాతీ, బెంగాలీ, భోజ్‌పురి లాంటి చిన్న ఇండస్ట్రీలు కూడా ఉపయోగించుకోవచ్చని పేర్కొన్నారు. మరి రకుల్ చేసిన ఈ వినూత్న ఆలోచనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.