ఫిల్మ్ డెస్క్– ఆ యువకుడు చెప్పిన మాట విని ఆయన కోపం నశాలాన్నంటింది. అతనిపై ఒంటికాలుపై లేచాడు. చెడా మడా తిట్టేశాడు. దవడ విరగ్గొడతా, నీకు బలుపు కాదు.. దూల.. అని ఫైర్ అయ్యాడు. అసలు ఎవరా యువకుడు, ఇంతకీ అతను ఏంచెప్పాడు. ఎందుకు ఆయనతో అంతలా తిట్లు తింటున్నాడనే కదా మా ప్రశ్న.
అసలు విషయం ఏంటంటే.. ఆ యువకుడు ఏకంగా హోం మినిష్టర్ కూతుర్నే ప్రేమించేశాడు. ఆయన స్నేహితుడైన తన బాస్ తో ఈ విషయం చెప్పి, హోంమినిస్టర్ తో పెళ్లి సంబంధం మాట్లాడమని అడిగాడు. మరి ఆయన ఊరుకుంటాడా చెప్పండి. అందుకే ఆ యువకుడిపైకి తిట్టల దండకంతో దాడి చేశాడు. ఈ సీన్ లో ఆ యువకుడు హీరో కార్తికేయ ఐతే, తిట్లు తిట్టిన ఆయన తనికెళ్ల భరణి. ఇది రియల్ లైఫ్ లో కాదు.. రీల్ లైఫ్‌లో అని మీరు అర్దమైయ్యే ఉంటుంది.
కార్తికేయ హీరోగా నటించిన తాజా సినిమా రాజా విక్రమార్క నవంబర్ 12న థియేటర్స్ లో విడుదలవుతోంది. ఈ నేపధ్యంలో నేచురల్ స్టార్ నాని సోమవారం ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. కార్తికేయ, నాని కలిసి గ్యాంగ్ లీడర్ లో నాయకుడు, ప్రతినాయకుడిగా నటించిన సంగతి తెలిసిందే. అదిగో అప్పటి నుంచి వీళ్లిద్దరి మధ్య మంచి స్నేహ బంధం ఏర్పడింది. ఆ అనుబంధంతోనే కార్తికేయ రాజా విక్రమార్క ట్రైలర్‌ను విడుదల చేశారు నాని.
హీరో కార్తికేయ తన డ్యూటీలో భాగంగా హోం మంత్రి కూతురితో స్నేహం చేస్తాడు. ఆ స్నేహం కాస్త ప్రేమగా మారుతుంది. తన ప్రేమ గురించి తన బాస్ తనికెళ్ల భర కే ముందు చెబుతాడు కార్తికేయ. తనికెళ్ల భరణి, హోం మినిష్టర్ మంచి స్నేహితులు. తనదగ్గర పనిచేస్తున్న ఉద్యోగి, హోంమినిస్టర్ కూతురును ప్రేమించాడని కార్తీక్ పై ఫైర్ అవుతాడు భరణి. నీకు బలుపు కాదు.. దూల, దవడ రాలగొడతా.. అని తిడతాడన్న మాట. రాజా విక్రమార్క లో తాన్యా రవిచంద్రన్ హీరోయిన్‌గా నటించగా, సాయి శ్రీపల్లి దర్శకత్వం వహించాడు.