నెల్లూరు రూరల్- తల్లిదండ్రుల తరువాత గురువుకు పవిత్రమైన స్థానం ఉంది మన దేశంలో. అందుకో మాతృదేవోభన్, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అన్నారు. పిల్లలకు తల్లిదండ్రుల తరువాత అంతటి పూజ్యనీయమైన స్థానంలో ఉన్న గురువులే విద్యా బుధ్దులు నేర్పిస్తారు. మరి అంతటి ఉన్నతమైన స్థానంలో ఉన్న టీచర్లే పెడదారి పడితే.. ఈ సమాజం ఎటు వెళ్తుంది. పిల్లలకు మంచి చెడూ చెప్పాల్సిన ఉపాధ్యాయులే చెడు మార్గాన వెళితే పరిస్థితి ఏంటి. ఇదిగో నెల్లూరులో గైరవప్రదమైన స్థానంలో ఉన్న ఓ ప్రొఫెసర్ చేసిన పనికి అంతా అవాక్కైపోతున్నారు.
పని మనిషి కోసం ప్రొఫెసర్ కట్టుకున్న భార్య, పిల్లలను హింసించారు. వారిని ఇంట్లో పెట్టి తాళం వేసి నరకం చూపించారు. ప్రొఫెసర్ ఇలాంటి దారుణానికి ఒడిగట్టడం నెల్లూరులో సంచలనం రేపుతోంది.
నెల్లూరు విక్రమసింహపురి యూనివర్సిటీలో చెంచురెడ్డి ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. నెల్లూరు, బాలాజీనగర్ ప్రాంతంలో భార్య, కుమారుడితో కలిసి ఉంటున్నాడు. ఈ మధ్య కాలంలో వీరి ఇంట్లో పని చేసేందుకు ఓ మహిళ వచ్చింది. ఈ క్రమంలో పని మనిషికి, ప్రొఫెసర్ కు మధ్య అక్రమ సంబంధం ఉందని భార్యకు డౌట్ వచ్చింది. దీంతో పని మనిషిని పనిలో నుంచి తీసేసింది ప్రొఫెసర్ భార్య. ఇంకేముంది అప్పటి నుంచి వారి ఫ్యామిలీలో గొడవలు ప్రారంభమయ్యాయి.
తొలగంచిన పని మనిషిని మళ్లీ పనిలో పెట్టుకుంటేనే తాను ఇంట్లో ఉంటానని ప్రొఫెసర్ చెంచురెడ్డి తెగేసి చెప్పేశాడు. అంతేకాదు భార్యా, కుమారుడిని ఇంట్లో పెట్టి తాళం వేసి బయటకు వెళ్లిపోయాడు. దీంతో స్థానికుల ద్వారా ఈ విషయం తెలుసుకున్న పోలీసులు తాళం పగులగొట్టి వీరిని బయటకు తీసుకొచ్చారు. పని మనిషితో అక్రమ సంబంధం కారణంగానే తన భర్త తనతో పాటు కొడుకును నిర్బంధించారని ప్రొఫెసర్ భార్య నెల్లూరు దిశ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ వ్యవహారంపై విచారణ చేపట్టారు. పని మనిషి కోసం కుటుంబాన్ని వేధించే ప్రొఫేసర్, ఇక విద్యార్థులకు ఎలాంటి పాఠాలు చెబుతారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. కలికాలం అంటే ఇదే మరి.