స్పెషల్ డెస్క్- నెల్లూరు ఆయుర్వేద మందు.. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశ వ్యాప్తంగా ఆ మందు చర్చనీయాంశమవుతోంది. నెల్లూరు జిల్లా కృష్ణపట్నం వాసి ఆనందయ్య తయారు చేసిన ఈ మందు వల్ల కరోనా రోగం ఇట్టే తగ్గిపోతందని ప్రచారం జరుగుతోంది. దీంతో వేలాది మంది కరోనా రోగులు కృష్ణపట్నానికి క్యూ కట్టారు. ఆనందయ్య ఆయుర్వేద మందు కోసం అంతా ఎగబడ్డారు. దీంతో అక్కడ పరిస్థితి చేయి దాటడం, ఈ ఆయుర్వేద మందుపై ప్రభుత్వం పరిశోదనకు ఆదేశించడంతో వారం రోజుల పాటు మందు పంపిణీని నిలిపివేశారు. దీంతో కరోనా రోగులంతా తీవ్ర నిరశకు లోనవుతున్నారు. ఇదంతా పక్కనపెడితే వివాదాస్పద సినీ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ నెల్లూరు ఆనందయ్య ఆయుర్వేద మందుపై కామెంట్ చేశాజు.
ఎప్పుడూ ఎవరినో ఒకరిని టార్గెట్ చేసే ఆర్జీవీ ఈ సారి ఆనందయ్యపై పడ్డాడు. తనదైన శైళిలో రాము ఆనందయ్య ఆయుర్వేద మందుపై వ్యగ్యాస్త్రాలు సంధించాడు. ఎయిర్ ఫోర్స్ వన్‌లో కృష్ణపట్నానికి అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, ఆ దేశ ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ ఫౌసీ బయలు దేరారని తెలిసిందని అన్నడు రాంగోపాల్ వర్మ. ఆనందయ్యతో డీల్ కుదుర్చుకోవడానికే వాళ్లిద్దరు వస్తున్నట్టున్నారని చెప్పుకొచ్చాడు. అంతవరకు ఆనందయ్య కిడ్నాప్ కాకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరుతున్నానని విజ్ఞప్తి చేశాడు రాము. ఆనందయ్యను జాతీయ సంపదగా గుర్తించి, సైనిక భద్రత కల్పించొచ్చు కదా అంటూ వ్యంగ్యంగా ట్విట్ చేశాడు వర్మ.
ప్రముఖుల నుంచి సామాన్యుల వరకు ఎవ్వరిని వదలని ఆర్జీవీ ఈ సారి ఆనందయ్యపై పై పడ్డాడన్నమాట. మిగతా వాళ్ల సంగతేమో గాని ఇలా ఉచితంగా కరోనా రోగులకు ఆయుర్వేద మందును అందిస్తున్న ఆనందయ్యపై సెటైర్లు వేయడంపై మాత్రం మర్మను తప్పుబడుతున్నారు నెటిజన్లు. మీకెలాగూ ఎవ్వరికి సేవ చేసే అలవాటు లేదు. కష్టాల్లో ఉన్నవారిని ఆదుకునే పెద్ద మనసు మీకు లేదు.. అని విమర్శిస్తున్నారు. అయినా వర్మ ఇవన్నీ పట్టించుకుంటే కదా. టేక్ ఇట్ ఈజీ.