స్పెషల్ డెస్క్– నెల్లూరు ఆనందయ్య ఆయుర్వేద ఔషధం.. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఇపుడు దేశవ్యాప్తంగా ఈ మందు పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కరోనా కు ఆనందయ్య మందు అద్భుతంగా పని చేస్తుందని చాలా మంది చెబుతున్నారు. దీంతో ఆనందయ్య కరోనా మందు కోసం జనాలంతా ఎగబడ్డారు. పెద్ద ఎత్తున కరోనా రోగులు ఆనందయ్య మందు కోసం కృష్ణపట్నం కు బారులు తీరారు. దీంతో ఆనందయ్య మందు పై వివాదాలు కూడా చెలరేగాయి. దీనిపై దృష్టి సారించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆనందయ్య మందుపై పరిశీలనకు ఆదేశించింది. అటు ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఐసీఏమర్ కూడా ఆనందయ్య కరోనా మందుపై పరిశోధనలు మొదలు పెట్టింది.
అటు టీటీడీ ఆయుర్వేద విభాగం సైతం ఆనందయ్య మందుపై రీసెర్చ్ చేస్తోంది. ఇటువంటి సమయంలో ఆనందయ్య మందు ఎపుడు అందుబాటులోకి వస్తుందో తెలియని అయోమయం నెలకొంది. దీంతో కరోనా మందు కోసం ఎదురు చూస్తున్న కరోనా రోగులు ఆందోళన చెందుతున్నారు. అయితే నెల్లూరు ఆనందయ్య కరోనా మందు ఫార్ములా ఓపెన్ గానే చెప్పారు కాబట్టి.. ఆ మందును ఎవరైనా తయారు చేసుకోవచ్చు అని చెబుతున్నారు. ఈ మేరకు చాలా మంది ఆయుర్వేద వైద్య నిపుణులు ఆనందయ్య కరోనా మందు తయారీ విధానాన్ని వివరిస్తున్నారు. అయితే ఏమేమి వనమూలికలు కలిపితే ఆ మందు తయారైందీ కూడా చెబుతున్నారు. ఏదీ ఎంత మోతాదులో కలుపుతున్నారో అన్న క్లారిటీ ఇవ్వకపోవడంతో కొంత గందరగోళం నెలకొంది.
ఇక ఆనందయ్య కరోనా మందులో మనకు అందుబాటులో ఉన్న దినుసులను వాడాలి. అందులో ప్రధానంగా పసుపు 10 గ్రాములు, నల్లజీలకర్ర 20 గ్రాములు, జాజికాయ 20 గ్రాములు, తోక మిరియాలు 50 గ్రాములు, పిప్పిలి 20 గ్రాములు, దాల్చిన చెక్క 30 గ్రాములు, అల్లం, శోంఠి 50 గ్రాములు, తాటి బెల్లం 100 గ్రాములు, తిప్పతీగ ఆకు 4 గ్రాములు, కుప్పిటాకు 20 గ్రాములు, నేల ఉసిరి ఆకు 10 గ్రాములు.. ఇలాంటి వనమూలికలతో ఇంట్లోనే స్వయంగా మందు తయారు చేసుకోవచ్చు. ఇంట్లో ఎవరికైనా కరోనా పాజిటీవ్ వచ్చినా, ఇమ్యూనిటీ పవర్ లేకపోయినా ఈ మందు వాడవచ్చని అంటున్నారు. అయితే ఈ ఆయుర్వేద మందును వాడితే కరోనా తగ్గుతుందని ఎక్కడ రుజువులు మాత్రం లేవు. కేవలం నమ్మకంతో మాత్రమే ఈ కరోనా మందును వాడుకోవాలి.