ఆర్ఆర్ఆర్ చిత్రానికి గానూ స్పాట్ లైట్ అవార్డును సొంతం చేసుకున్నాడు రామ్ చరణ్. ఈ సందర్భంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ తరపున ఓ అభినందన ప్రకటన విడుదల చేశాడు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. సినిమాలతోనే కాకుండా జనసేన పార్టీ అధినేతగా.. మానవతావాదిగా కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్నారు. కష్టాల్లో ఉన్న వారికి సాయం చేయడమే కాకుండా టాలెంటెడ్ పీపుల్స్ ను ఆదరించడంలోనూ, వారికి సాయం చేయడంలోనూ.. వారిని అభినందించడంలోనూ ఎప్పుడూ ముందుంటారు పవర్ స్టార్. తాజాగా ‘హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్స్’ అవార్డుల్లో ఆర్ఆర్ఆర్ సినిమా పలు పురస్కారాలు దక్కించుకుంది. ఇక రామ్ చరణ్ స్పాట్ లైట్ అవార్డు దక్కించుకోవడంతో పవన్ కళ్యాణ్ అభినందనలు తెలియజేశాడు.
ఆర్ఆర్ఆర్.. ప్రతిష్టాత్మక హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డుల్లో సత్తా చాటింది. హాలీవుడ్ సినిమాలను వెనక్కి నెట్టి.. పలు అవార్డులను దక్కించుకుంది. ఇక ఆర్ఆర్ఆర్ చిత్రానికి గానూ స్పాట్ లైట్ అవార్డును సొంతం చేసుకున్నాడు రామ్ చరణ్. ఈ సందర్భంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ తరపున ఓ అభినందన ప్రకటన విడుదల చేశాడు. ఈ ప్రకటనలో..”ప్రతిష్టాత్మకమైన హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డుల్లో ఆర్ఆర్ఆర్ పలు పురస్కారాలు దక్కించుకోవడం సంతోషకరం. ఇక వేదికపై రామ్ చరణ్ స్పాట్ లైట్ అవార్డును స్వీకరించడం, బెస్ట్ వాయిస్/మోషన్ కాప్చర్ పెర్ఫార్మన్స్ ను రామ్ చరణ్ తో ప్రకటింపచేయడం సంతోషాన్ని కలిగించింది” అని పవన్ కళ్యాణ్ అన్నారు.
ఈ సందర్భంగా.. రామ్ చరణ్ కి, డైరెక్టర్ రాజమౌళికి, ఆర్ఆర్ఆర్ చిత్ర బృందానికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు పవన్ కళ్యాణ్. భవిష్యత్ లో చరణ్ మరిన్ని సినిమాలు చేసి, అవి ప్రేక్షకుల ఆశీర్వాదం పొంది.. ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నట్లు పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఇక హాలీవుడ్ క్రిటిక్స సూపర్ ఛాయిస్ అవార్డుల్లో.. బెస్ట్ యాక్షన్ మూవీస్ విభాగంలో.. బెస్ట్ యాక్టర్స్ గా ఎన్టీఆర్, రామ్ చరణ్ నామినేట్ కావడంతో.. తారక్ పై తనకున్న ప్రేమను మరోసారి చాటుకున్నాడు. ఇక ఇప్పటికే పలు అంతర్జాతీయ అవార్డులను తన ఖాతాలో వేసుకున్న ఆర్ఆర్ఆర్.. మరిన్ని ఘనతలు సాధించాలని అభిమానులు కోరుకుంటున్నారు.
అభినందనలు… రామ్ చరణ్ @AlwaysRamCharan – JanaSena Chief Shri @PawanKalyan pic.twitter.com/bJQgy8TPf1
— JanaSena Party (@JanaSenaParty) February 25, 2023