ఫిల్మ్ డెస్క్- వకీల్ సాబ్.. ఈ సినిమా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కే కాదు చాలా మందిని మళ్లీ ఫాంలోకి తీసుకువచ్చింది. పవన్ కు మూడేళ్ల తరువాత వకీల్ సాబ్ మంచి హిట్ మూవీ కాగ, మిగతా నటీనటులకు కూడా మంచి పేరు తీసుకువచ్చింది. వకీల్ సాబ్ అందాల భామ అనన్య నాగళ్లకు బాగా గుర్తింపు తెచ్చింది. అంతకు ముందు మల్లేశం సినిమాలో హీరోయిన్ గా చేసినా అంతగా ఐడెంటిటీ రాలేదు అనన్యకు.
వకీల్ సాబ్ లో నివేథా థామస్, అంజలిలతో పోటీ పడి నటించిన అనన్య ప్రేక్షకులకు బాగా దగ్గరైందని చెప్పవచ్చు. కీలకమైన పాత్రల్లో నటించిన ముగ్గురు అమ్మాయిలు ఇండస్ట్రీ ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుకుంటున్నారు. ఈ క్రమంలో అనన్య నాగళ్ళకి తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి పేరు వచ్చింది. ఇంకేముంది అనన్య నాగళ్లకు అప్పుడే అవకాశాలు వెల్లువెత్తున్నాయని తెలుస్తోంది.
దీనికి తోడు వకీల్ సాబ్ మూవీ సక్సస్తో అనన్య కూడా ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా యాక్టివ్గా ఉంటోంది. మీడియం రేంజ్ సినిమా డైరెక్టర్లు చాలా మంది అనన్యతో సంప్రదింపులు జరుపుతున్నారట. ఇక్కడ ఇంట్రెస్టింగ్ అంశం ఏంటంటే పవన్ కళ్యాణ్ అనన్య నటకు మెచ్చి.. ఆమెకు అవకాశాలు ఇవ్వాలని ఒకరిద్దరు నిర్మాతలకు రికమెండ్ చేశారని ఇండస్ట్రీ టాక్. మరి పవన్ సిఫారసు చేశాక ఇక ఛాన్స్ లకు కొదవేముంది.
ఇప్పటికే నాలుగైదు కధలు విన్న అనన్య త్వరలోనే రెండు ప్రాజెక్టులకు ఓకే చెప్పనుందని సమాచారం. అనన్య నాగళ్ళ తెలుగు ఇండస్ట్రీలో యంగ్ హీరోల సరసన అవకాశాలు అందుకొని స్టార్ హీరోయిన్ అవుతుందని అప్పుడే ఫిల్మ్ నగర్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరి అనన్యకు మనమూ బెస్ట్ ఆఫ్ లక్ చెబుదామా.