ఫిల్మ్ డెస్క్- యంగ్ టైగర్ ఎన్టీఆర్ కరోనా బారిన పడ్డారు. తనకు కరోనా పాజిటివ్ వచ్చినట్లుగా ఆయనే స్వయంగా చెప్పారు. ఈమేరకు ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. నేను కొవిడ్ 19 బారిన పడ్డాను.. దయచేసి ఎవరూ బాధపడకండి.. ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నాను.. నేను మరియు నా ఫ్యామిలీ ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉండి.. డాక్టర్స్ సమక్షంలో కరోనా ప్రొటోకాల్స్ పాటిస్తున్నాము.. గత కొన్ని రోజులుగా నాతో కాంటాక్ట్ అయిన వాళ్లందరు కరోనా పరీక్షలు చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాను.. అందరూ క్షేమంగా ఉండండి.. అని ఎన్టీఆర్ తన ట్వీట్టర్ మెస్సేజ్ ద్వార పేర్కొన్నారు.
ఇక ఎన్టీఆర్ కు కరోనా సోకిందని తెలుసుకున్న వాళ్లందరు ఆయనకు త్వరగా కరోనా తగ్గాలని కోరుకుంటున్నారు. ఎన్టీఆర్ త్వరగా కోలుకోవాలని కోరుతూ పలువురు జాగ్రత్తలు చెబుతున్నారు. తమ అభిమాన నటుడు త్వరగా కరోనా నుంచి కోలుకుని, క్షేమంగా బయటికి రావాలని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆకాంక్షిస్తున్నారు. పలువురు సినీ ప్రముఖులు కూడా ఎన్టీఆర్ త్వరగా కరోనా నుంచి కోలుకోవాలని ట్వీట్ చేస్తున్నారు. ఇక ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ ఆర్ ఆర్ సినిమా చేస్తున్నారు.