బాలయ్య కోసం డైరెక్టర్ అనిల్ రావిపూడి మరో క్రేజీ ప్రయోగం చేసేందుకు సిద్ధమైపోతున్నాడు. ఏకంగా 'బాహుబలి' బ్యూటీనే విలన్ గా చేసేస్తున్నాడట.
బాలయ్య మంచి ఊపుమీదున్నాడు. ‘అఖండ’, ‘వీరసింహారెడ్డి’ చిత్రాలతో వరస హిట్స్ కొట్టిన ఈయన.. ‘అన్ స్టాపబుల్’ షోతో తన క్రేజ్ ని డబుల్ త్రిబుల్ చేసుకున్నాడు. రేంజ్ పెంచేసుకున్నాడు. దీంతో బాలకృష్ణ తర్వాత మూవీస్ పై అంచనాలు పెరిగిపోతున్నాయి. ఎంటర్ టైన్ మెంట్ సినిమాలతో ప్రేక్షకుల్ని తెగ అలరిస్తున్న డైరెక్టర్ అనిల్ రావిపూడి.. బాలయ్యతో సినిమా చేసేందుకు రెడీ అయిపోయాడు. ఇప్పటికే షూటింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. అయితే ఈ ప్రాజెక్టుకి సంబంధించిన క్రేజీ న్యూస్ బయటకొచ్చింది. ఇందులో ఏకంగా ఓ హాట్ బ్యూటీని విలన్ ని చేసేశారట.
ఇక వివరాల్లోకి వెళ్తే.. సాధారణంగా బాలయ్య సినిమాలంటే విలన్స్ అరివీర భయంకరంగా కనిపిస్తారు. బాలయ్యని తట్టుకుని నిలబడాలి, పవర్ ఫుల్ డైలాగ్స్ చెప్పాలంటే ఆ మాత్రం ఉండాలి. లేకపోతే సీన్ పండదు. కానీ బాలయ్యతో చేస్తున్న సినిమా కోసం డైరెక్టర్ అనిల్ రావిపూడి మాత్రం కాస్త కొత్తగా ఆలోచిస్తున్నాడా అనిపిస్తుంది. ఎందుకంటే ఏకంగా ‘బాహుబలి’ బ్యూటీ నోరా ఫతేహిని రంగంలోకి దింపుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు ఐటమ్ సాంగ్స్, చిన్న చిన్న పాత్రల్లో కనిపించిన ఈమెని బాలయ్య కోసం ఏకంగా విలన్ ని చేస్తున్నారనేసరికి ప్రేక్షకుల్లో కూడా ఓ ఆసక్తి క్రియేట్ అవుతోంది.
తెలుగులోనూ ‘బాహుబలి’తోపాటు ఊపిరి, కిక్ 2, లోఫర్ లాంటి సినిమాల్లో డ్యాన్సులతో ఆకట్టుకున్న నోరా.. ప్రస్తుతం బాలీవుడ్ లో స్పెషల్ సాంగ్స్ చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. స్టార్ హీరోల దగ్గర నుంచి మిడ్ రేంజ్ హీరోల వరకు చాలామంది ఈమెని తమ సినిమాల్లో ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఈమెని విలన్ తరహా రోల్ గురించి తీసుకోవాలనుకోవడం కాస్త కొత్త విషయమే అని చెప్పాలి. NBK 108 కోసం నోరాని తీసుకోవడం ఇంకా డిస్కషన్ స్టేజీలోనే ఉందని, త్వరలో క్లారిటీ వచ్చేస్తుందని అంటున్నారు. మరి బాలయ్య-నోరా ఫతేహి కాంబో సెట్ అయితే సీన్స్ ఎలా ఉంటాయని మీరనుకుంటున్నారు. కింద కామెంట్ చేయండి.
#NBK108 Next Schedule shoot starts from March 1st week at Hyderabad💥#NandamuriBalakrishna @AnilRavipudi pic.twitter.com/4XQGDcPb1O
— manabalayya.com (@manabalayya) February 27, 2023