స్పెషల్ డెస్క్- ఈ రోజుల్లో మానవ సంబందాలకు విలువ లేకుండా పోతోంది. వావి వరుసలు లేకుండా తొంత మంది ప్రవర్తిస్తున్న తీరు సమాజానికి తలవంపులు తెస్తోంది. విచ్చలవిడితనంతో వరుసలు మరిచి ప్రేమ పేరుతో సిగ్గుమాలిన పనులు చేసి వారి కుటుంబాల పరువున సైతం తీస్తున్నారు. ఇలాంటి ఘటనే బీహార్ లో జరిగింది. మేనల్లుడే కదా అని అతడికి చనువిస్తే.. చివరికి భార్యను లేపుకెల్లాడో ప్రబుద్దుడు.
బీహార్‌లోని జముయి జిల్లాకు చెందిన ఓ వ్యక్తి పెళ్లి చేసుకుని భార్యతో ముంబయిలో కాపురం ఉంటున్నాడు. అక్కడే ఆతని మేనల్లుడు కూడా ఉంటున్నాడు. అతను ఆటో రిక్షా నడుపుతూ.. అప్పుడప్పుడు ఇంటికి వచ్చి వెళ్తుండేవాడు. ఈ క్రమంలో అతడి భార్య, మేనల్లుడి మధ్య ప్రేమ పుట్టుకొచ్చింది. భర్త ఇంట్లో లేని సమయంలో అతని మేనల్లుడితో ఆమె ఏకాంతంగా గడిపేది. ఇలాంటివి ఎక్కువ రోజులు దాగవుకదా.
ఓ రోజు మేనల్లుడితో భార్య సరసాలు ఆడుతుంటేఆమె భర్త చూశాడు. వారిద్దరిని హెచ్చరించి, ఇకపై తన ఇంటి గుమ్మం తొక్కవద్దని మేనల్లుడికి చెప్పాడు. ఈ విషయం వారి కుటుంబం మొత్తానికి తెలిసిపోయింది. కానీ మేనల్లుడు, అత్త ఒకరిని విడిచి ఒకరు ఉండలేని స్థితికి వచ్చారు. ఇంకేముంది ఓ రోజు ఆమె భర్త ఇంట్లోలేని సమయంలో అతని మేనల్లుడు ఆమెను గుట్టుచప్పుడు కాకుండా తీసుకెళ్లిపోయాడు. ముంబయి శివారులో ఎంచక్కా ఇద్దరు కలిసి సహజీవనం చేస్తున్నారు.
అంతే కాదు కొన్ని రోజుల తర్వాత వివాహం కూడా చేసుకున్నారు. వారి సంప్రదాయం ప్రకారం తన అత్త నుదిటి మీద సింధూరం పెట్టి ఆమెను భార్యగా చేసుకున్నాడు. ఆమె కూడా ఏ మాత్రం సిగ్గులేకుండా కొత్త భర్త కాళ్లకు దండం పెట్టింది. వీరి పెళ్లికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.