పెళ్లిల్లు వైరల్ సంఘటనలకు వేదికలుగా మారుతున్నాయి. వినూత్న ఆలోచనలతో అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు వధూవరులు. తాజాగా ఓ భర్త.. నూతన వధువుకి ఊహించని సర్ప్రైజ్ ఇచ్చాడు. ఏకంగా ఆకాశంలో ఏడడుగులు వేసేలా ఏర్పాట్లు చేశాడు..
పెళ్లి అంటే యువతీ, యువకులకు ఎన్నో కలలు, కోరికలుంటాయి. కాబోయే వాడి గురించి ప్రతి అమ్మాయి ఎన్నో కలలు కంటుంది. కాబోయే వాడు తనను పువ్వుల్లో పెట్టి చూసుకోవాలని భావిస్తుంది. అత్తింట్లో కూడా తనకు పుట్టింట్లో లభించినట్లే ప్రేమ, ఆదరణ లభిస్తే చాలు అనుకుంటుంది. అయితే అందరు అమ్మాయిలకు అత్తారింట్లో ప్రేమాభిమానాలు లభించడం కష్టం. ఇక భార్య అంటే కట్నం తెచ్చే ఓ పని మనిషి అనుకునే వాళ్లు నేటికి కూడా మన సమాజంలో ఉన్నారు. అలానే భార్యను అమితంగా ప్రేమించే వారు కూడా ఉన్నారు. తాజాగా కొత్త పెళ్లి కూతురికి ఊహించని గిఫ్ట్ ఇచ్చి సర్ప్రైజ్ చేశాడు ఓ వరుడు. వివాహం కాగానే నూతన వధువుని హెలికాప్టార్‌లో తీసుకెళ్లి ఆకాశంలో ఏడడుగులు వేశాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరలవుతోంది. ఆ వివరాలు..
ఉత్తరప్రదేశ్, బులంద్‌షహర్ జిల్లాకు చెందిన లోకేంద్ర ప్రతాప్ ఆస్ట్రేలియాలో పైలెట్‌గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో అతడికి మీరట్‌కు చెందిన శ్యామ్సిరాణాతో పెళ్లి నిశ్చయం అయ్యింది. విశేషం ఏంటంటే.. ఆమె కూడా కమర్షియల్ పైలెట్‌గా పని చేస్తోంది. కుటుంబ సభ్యులు, బంధుమిత్రలు సమక్షంలో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఇక వివాహం సందర్భంగా వధువుకు ఊహించని సర్ప్రైజ్ ఇచ్చాడు ప్రతాప్. పెళ్లి తంతు పూర్తి కాగానే హెలికాప్టర్లో ఎక్కి.. ఆకాశంలో ఏడడుగులు వేశారు ఈ కొత్త జంట. ఏడేడు జన్మలు కలిసి ఉంటామని ప్రమాణం చేసుకున్నారు. ఆ తర్వాత ఇంటికి చేరుకున్నారు. వరుడు చేసిన పనికి అందరూ ఆశ్చర్యపోయారు. భార్య అంటే ఎంత ప్రేమో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి లోకేంద్ర చేసిన పనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.