ఊరు ఏదైనా, జిల్లా ఏదైనా వీధి కుక్కల బెడద మాత్రం ఇప్పుడు ప్రజలకు పెద్ద సమస్యగా మారింది. ఎక్కడ చూసినా ఈ వీధి కుక్కల దాడుల గురించే వార్తలు వస్తున్నాయి. తాజాగా వెలుగు చూసిన ఓ ఘటన ఇప్పుడు ప్రజలను భయపెడుతోంది.
వీధి కుక్కలు అనేవి ఇప్పుడు పెద్ద సమస్యగా మారాయి. ఎక్కడ చూసినా వీధి కుక్కల దాడి గురించే చర్చ జరుగుతోంది. ప్రాంతంతో సంబంధం లేకుండా దేశవ్యాప్తంగా రోజూ వీధికుక్కల దాడి విషయంలో ఏదో ఒక వార్త వస్తూనే ఉంది. తాజాగా వెలుగు చూసిన ఘటన అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తోంది. ఎందుకంటే ఒక వీధి కుక్క దాడిలో ఓ యువకుడి పరిస్థితి విషయంగా ఉంది. ఒక్కసారిగా దాడి చేసిన ఆ కుక్క అతని ప్రైవేట్ పార్ట్ గట్టిగా పట్టుకుంది. అతను ఎన్ని ప్రయత్నాలు చేసినా అది వదలలేదు. చివరికి అతను ఆస్పత్రిలో ప్రాణాల కోసం పోరాడుతున్నాడు. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఈ ఘటన పెద్దఎత్తున చర్చకు తెర లేపింది.
వీధి కుక్కల దాడుల ఘటనలు ఈ మధ్యకాలంలో బాగా వినిపిస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఈ వార్తలు వింటూనే ఉన్నాం. తాజాగా హర్యానా రాష్ట్రం కర్నాల్ లో జరిగిన వీధి కుక్క దాడి అందరినీ భయపెడుతోంది. బిజ్నా గ్రామానికి చెందిన 30 ఏళ్ల కరణ్ తన పొలంలో పనిచేస్తున్నాడు. గోధుమ గడ్డి తయారు చేసే ఒక రీపర్ యంత్రం పొలంలో ఉంది. అతను ఆ యంత్రం దగ్గరకు వెళ్లాడు. అయితే ఆ మెషిన్ దగ్గర ఉన్న ఓ బిట్ బుల్ బ్రీడ్ కుక్క అతనిపై దాడి చేసింది. ఒక్కసారిగా అతని ప్రైవేట్ పార్ట్ పట్టుకుంది. అతను ఎంత ప్రయత్నించినా అది వదలలేదు. తన శక్తి కొద్ది విడిపించుకునేందుకు పోరాడాడు. అతని వద్ద ఉన్న ఒక గుడ్డ ముక్కను దాని నోట్లో పెట్టాడు.
అయినా అది అస్సలు వదలకుండా అలాగే పట్టుకుని ఉంది. కరణ్ అరుపులకు చుట్టుపక్కల వాళ్లు కూడా అక్కడికి చేరుకున్నారు. అంతలో ఆ కుక్క కరణ్ ని విడిచిపెట్టగానే స్థానిక ఆస్పత్రికి తరలించారు. కరణ్ కొన్ని గంటలు స్పృహలో లేడు. అతనికి వైద్యులు చికిత్స చేస్తున్నారు. అయితే అతని పరిస్థితి మాత్రం విషమంగానే ఉన్నట్లు చెబుతున్నారు. ఆ కుక్క గ్రామానికి చెందిన ఒక వ్యక్తి అంటూ అనుమానాలు వెల్లిబుచ్చారు. వారం రోజులుగా ఆ కుక్క వీధుల్లో తిరుగుతోందని కరణ్ కుటుంబసభ్యులు చెప్పారు. రెండ్రోజుల క్రితం వేరే వారిపై కడా దాడి చేసినట్లు చెప్పారు. ఆ కుక్కతో ఎంతైనా ప్రమాదమే అని గ్రామస్థులు అంతా కలిసి ఓ నిర్ణయానికి వచ్చారు. కర్రలతో కొట్టి ఆ వీధి కుక్కను చంపేశారు. ఆ కుక్క యజమానిని గుర్తించి.. కఠిన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు.