కృషి, పట్టుదల ఉంటే ఆడపిల్లలైనా అన్ని విషయాల్లో ముందుంటారు. ఈ రోజుల్లో ఆడపిల్లలు రంగాల్లో దూసుకెళ్తున్నారు. పేరెంట్స్ వారికి అనుగుణంగా అన్ని విషయాల్లో సపోర్ట్ చేస్తే కొడుకులకు ఏమాత్రం తీసి పోరు.
సాధారణ కుటుంబంలో ఆడపిల్ల పుట్టిందనగానే భారంగా భావిస్తారు. వారిని చదివించి పెద్దచేసి పెళ్లి చేయాలని వారికి సంబంధించిన అన్ని విషయాలు ఖర్చులుగానే భావిస్తారు. పైగా ఆడపిల్లలకు ఈ రోజుల్లో జరుగుతున్న అఘాయిత్యాలను తలచుకుని వారికి తగిన స్వేచ్ఛ కూడా ఇవ్వరు. వారి ప్రతిభను గుర్తించి సహకారం అందిస్తే ఆడపిల్లలు కూడా మగవారికంటె ఎందులోనూ తీసిపోరు. ప్రస్తుతం ఆడవాళ్లు కూడా అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. కొంతమంది పేరెంట్స్ ఆడ, మగ అనే తేడా లేకుండా ఇద్దరు సమానమనే భావంతో పిల్లలను పెంచుతున్నారు. సామాన్య కుటుంబంలో పుట్టి కూడా తన 22వ ఏటనే IPS సాధించింది హర్యానా యువతి ప్రీతి యాదవ్. ఆమె సక్సెస్ స్టోరీ ఏంటో మనం తెలుసుకుందాం..
ప్రీతి యాదవ్ ఉత్తరప్రదేశ్ కేడర్‌కు చెందిన 2019 బ్యాచ్ IPS అధికారి. హర్యానాలోని రేవారీ జిల్లా ఆమె స్వస్థలం. తండ్రి ముఖేష్ యాదవ్. అతను చండీగఢ్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. చదువులో ప్రీతి చాలా చురుగ్గా ఉండేది. హ్యుమానిటీస్‌లో 96.2 శాతం మార్కులు తెచ్చుకుని 12వ స్థానంలో నిలబడింది. గ్రాడ్యుయేషన్‌లో గోల్డ్ మెడల్ సాధించింది ప్రీతి. జాగ్రఫీలో బీఏ ఆనర్స్ డిగ్రీని పొందింది. అండర్ గ్రాడ్యుయేషన్ చదివే సమయంలో UPSC పరీక్షకు ప్రిపేర్ అయ్యింది. దీని కోసం పీజీ చదువును మధ్యలోనే ఆపేయాల్సి వచ్చింది. ప్రీతి కృషి ఫలించి 2019లో తన 22 ఏళ్లకే UPSC పరీక్ష నెగ్గింది. తాను ప్రిపేర్ అయ్యే సమయంలో ఎటువంటి ఫార్ములా ఆధారంగా చదవలేదని.. సొంతంగా చదువుకున్నానని ప్రీతి ఓ ఇంటర్వ్యూలో తెలిపింది.
యూపీఎస్సీ సిలబస్ చాలా పెద్దగా ఉంటుంది కానీ ‘మన లక్ష్యం పెద్దదైతే, సిలబస్ చిన్నదవుతుంది’ అని తెలిపింది. IPS అయిన తర్వాత ఆమె తొలి పోస్టింగ్ సహరన్‌పూర్‌లో ఏఎస్పీగా జాయిన్ అయ్యింది. ప్రస్తుతం నోయిడాలో డీసీపీగా విధులు నిర్వహిస్తుంది. తన విధుల్లో మహిళల కోసం చేస్తున్న కృషి అభినందనీయం. ప్రీతి మహిళల భద్రతకు అవగాహన కలిగించేందుకు నిరంతరం ప్రయత్నిస్తోంది. అంతేకాకుండా ప్రీతికి నటనపై కూడా ఆసక్తి ఎక్కువే. తన ఇన్‌స్టాగ్రామ్ లో రకరకాల కళలను షేర్ చేస్తుంది. ఆమెకు ట్రావెల్స్ చేయడం అంటే చాలా ఇన్‌ట్రస్ట్. తరచుగా సోషల్ మీడియాలో పలు ప్రదేశాలకు సంబంధించిన ఫొటోలను పోస్ట్ చేస్తుంది.