సాధారణంగా మేకలు, ఆవులు, గేదెలు పాలు ఇవ్వడం చూశాం. కానీ ప్రతిరోజూ ఒక లీటరు పాలు ఓ మేకపోతు పాలు ఇవ్వడం ఎక్కడైనా విన్నారా.. అసలు ఇది ఎలా సాధ్యమైంది అని ఆశ్చర్యం వేసింది కదా.. ప్రకృతికి విరుద్ధంగా ఎలా జరుగుతుంది అని ఆశ్చర్యపోయినా.. ఇది నిజం. మేకపోతు పాలు ఇస్తున్న విచిత్రమైన ఘటన హవేరి జిల్లా గనగల్ తాలూకా నరేగల్ గ్రామంలో వెలుగులోకి వచ్చింది. బ్రహ్మంగారు చెప్పినవన్నీ మన కళ్లముందే జరుగుతున్న విషయం తెలిసిందే. అందుకే చాలా మంది బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజమే అని నమ్మడం మొదలు పెట్టారు. వివరాల్లోకి వెళితే..
కర్ణాటక రాష్ట్రంలో హనగల్ తాలూకాలోని నరేగల్ గ్రామానికి చెందిన సాదిక్ మకందార్ కుటుంబం ఓ మేకపోతును పెంచుతోంది. గతంలో సాదిక్ ఓ మేకను పెంచుకున్నాడు.. దానికి ఒక మేకపోతు పుట్టింది. ఇటీవల ఆ తల్లి మేక చనిపోవడంతో మేకపోతును దేవుడికి అంకితం ఇచ్చారు సాదిక్ కుటుంబం. సుల్తాన్‌గా పేరుపెట్టి కుటుంబలో ఒకటిగా దాన్ని ఎంతో జాగ్రత్తగా పెంచుకుంటున్నారు.
ప్రస్తుతం ఆ మేకపోతుకు ఏడాదిన్నర వయసు ఉంది.. దాన్ని ఎంతా జాగ్రత్తగా పెంచుకుంటున్నాడు సాదిక్. ప్రతిరోజూ గడ్డి, కూరగాయలు తెచ్చి తినిపిస్తున్నాడు. ఈ క్రమంలో మేకపోతు పాలు ఇవ్వడం చూసి మొదట ఆశ్చర్యపోయాడు సాధిక్. ఆ మేకపోతే పాలిస్తూ స్థానికులను ఆశ్చర్య పరుస్తోంది. ఈ తరహా సంఘటనలు చాలా అరుదుగా జరుగుతుంటాయని.. కొన్నిసార్లు హార్మోన్లలో మార్పుల వల్ల ఇలా జరుగుతుందని పశువైద్యాధికారులు చెప్పారు. ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.