ఈ సృష్టిలో మనిషి కాకుండా జంతువుల్లో ఆడవి మాత్రమే పిల్లలను కనగలవు, పాలివ్వగలవు. ఇంట్లో మనం పెంచుకునే ఆవు, గెదే, మేకల్లో కూడా ఆడవే పాలిస్తాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకునే మేకపోతు కాస్త భిన్నం.
ప్రపంచంలో ఎన్నో వింతలు, విశేషాలున్నాయి. మనుషుల విషయంలోనే కాకుండా చెట్లు, చేమలు, పశుపక్షాదుల్లో కూడా వింత గొల్పే సంఘటనలు చోటుచేసుకున్నాయి. చెట్లు కన్ను తెరిచిందని, లేదా నీరు కార్చిందని, రాయి పాలు తాగుతుందని, మూడు కాళ్లతో పశువులు పుట్టాయని వింత వార్తలు విన్నాం, చూశాం. ఏమీ మారినా ఈ సృష్టిలో మనిషి కాకుండా ఆడ జంతువులు మాత్రమే పిల్లలను కనగలవు, పాలివ్వగలవు. ఇంట్లో మనం పెంచుకునే ఆవు, గెదే, మేకల్లో కూడా ఆడవి మాత్రమే పాలిస్తాయి. కానీ మగ జంతువులు పాలు ఇవ్వడం గురించి విన్నారా. అయితే ఈ విడ్డూరమైన వార్త మీ కోసమే. ఓ ఊరిలో మేకపోతు పాలిస్తున్న వింత ఘటన చోటుచేసుకుంది.
మేకపోతు పాలిస్తున్న విచిత్ర ఘటన రాజస్థాన్‌లోని కరౌలీలో జరిగింది. సపోత్రా తాలూకా గోత్రా గ్రామంలో అమీర్ ఖాన్ అనే పశువుల కాపరి వద్ద పదుల సంఖ్యంలో మేకలున్నాయి. ప్రతిరోజూ వాటిని అడవికి తీసుకెళ్లి.. మేపుకొస్తాడు. అమీర్ ఖాన్ పెంచుకుంటున్న మేకల్లో రెండేళ్ల వయసున్న ఓ మేకపోతు ఉంది. దీనికి బాద్ షా అని పేరు పెట్టుకుని చూసుకుంటున్నారు. ఎందుకంటే ఈ మేకపోతు .. మిగిలిన వాటిలా కాదూ, కాస్త భిన్నం. పురుషాంగం, వృషణాలతో పాటు రెండు పొదుగులను కూడా కలిగి ఉంది. 15 ఏళ్లుగా మేకలను పెంచుతున్నప్పటికీ ఇలాంటి మేకపోతును ఎప్పుడూ చూడలేదని అమీర్ ఖాన్ చెబుతున్నాడు. పాలు ఇస్తున్న ఈ మేకపోతును చూసేందుకు గ్రామస్తులు ఎగబడుతున్నారు.
ఈ మేక 24 గంటల్లో 250 గ్రాముల పాలను ఇస్తుందట. తాను కరణ్‌పూర్‌లోని భైరోగావ్‌లో ఈ మేకపోతును రూ.51,000కు కొనుగోలు చేసినట్లు అమీర్ ఖాన్ చెప్పాడు. అయితే ఈ మేకపోతు పాలివ్వడం గురించి తెలిసి.. బంగ్లాదేశ్‌కు చెందిన ఓ వ్యాపారవేత్త రూ. 1 లక్షకు కొనుగోలు చేశారని తెలిపాడు. త్వరలోనే ఇది బంగ్లాదేశ్‌కు వెళ్లనుందని దాని యాజమాని తెలిపాడు. ఈ మేకపోతు ప్రతిరోజూ గేదె పాలు తాగుతుంది. పాలతో పాటు, ధోవ్ అకాసియా చెట్టు ఆకు, గోధుమ గింజలు, నానబెట్టిన పప్పును ఇష్టంగా తింటుందట. ప్రస్తుతం ఈ మేక గురించి వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.