"ఏమండీ మన ఇల్లు ఇటుకాదు కదా? ఎందుకు ఇటువైపు తీసుకెళ్తున్నారు?" అని బైక్ పై వెనుక కూర్చున్న ఓ భార్య.. భర్తను ప్రశ్నించింది. ఏంది నా భార్య తేడాగా మాట్లాడుతుందని భర్త వెనక్కి తిరిగి చూస్తే.. ఆమె తన భార్య కాదని అవాక్యయ్యాడు.
మన నిత్య జీవితంలో అనేక కామెడీ సన్నివేశాలు జరుగుతుంటాయి. వీటిలో కావాల్సి చేసే కామెడీలు కొన్ని అయితే.. అనుకోకుండా యాదృచ్ఛికంగా జరిగేవి మరికొన్ని ఉంటాయి. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య జరిగే సన్నివేశాలు నవ్వుల పువ్వులు పూయిస్తాయి. థియేటర్ కు వెళ్లినప్పుడు.. ఆ జనంలో భర్త అనుకుని మరొక వ్యక్తితో వెళ్లి సీట్లో కూర్చుకోవడం, అదే విధంగా అటువైపు వ్యక్తి కూడ వేరే మహిళను తన భార్య అనుకుంటాడు. అలా ఇద్దరూ భుజం మీద చేయి వేసి మాట్లాడటం చేస్తుంటారు. కాసేపటి తరువాత ఒకరిముఖాలు మరొకరు చూసుకుని షాక్ అవుతుంటారు. ఆ సీన్ చూసిన చుట్టుపక్కల వారు పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకుంటారు. అచ్చం అలాంటి ఘటనే కర్ణాటకలో జరిగింది. తన భార్య అనుకుని పరాయి మహిళను బైక్ పై ఎక్కించుకున్నాడు ఓ భర్త. ఆ మహిళ కూడా తన భర్తే అనుకుని బైక్ ఎక్కి.. వెళ్లింది. కాసేపటి తరువాత ఏం జరిగిందంటే.. ఆ పూర్తి వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
కర్ణాటక రాష్ట్రం హావేరి జిల్లా రాణే బెన్నూరుకు చెందిన ఓ వ్యక్తి బైక్ పై తన భార్యతో కలిసి బంధువుల ఇంటికి వెళ్లి..తిరిగి తమ ఇంటికి బయలుదేరాడు. వీరిద్దరు ట్రాఫిక్ రూల్స్ చక్కగా పాటిస్తూ.. హెల్మెట్ ధరించి ప్రయాణం చేస్తున్నారు. ఈ క్రమంలో పెట్రోల్ కొట్టించేందుకు ఓ బంక్ వద్దకు వెళ్లారు. పెట్రోల్ కొట్టిస్తుండగా భార్య కొద్ది దూరంలో నిల్చుంది. పెట్రోల్ కొట్టించడం అయ్యాక భార్య అనుకుని హెల్మెట్ ధరించిన మరో మహిళ వద్దకు వెళ్లి.. ఎక్కు అన్నాడు. భర్త లాంటి బైక్.. అదే శరీర సౌష్ఠవం, తెల్లచొక్క.. ఒకే రంగు హెల్మెట్ ఉండటంతో సదరు మహిళ కూడా పొరపాటు పడి ఎక్కింది.
అలా ఇద్దరూ కొద్దిదూరం ప్రయాణించారు. ఈ క్రమంలో ” ఏమండీ మన ఇల్లు ఇటు కాదు కదా?.. మరి ఎందుకు ఇటువైపు వెళ్తున్నారు?” అంటూ భార్య ప్రశ్నించింది. ఆమె అలా అనడంతో అతడు ఒక్కసారిగా అవాక్యయ్యాడు. తీరా చూస్తే ఆమె వేరే వ్యక్తి భార్య. తన భార్య రంగు చీర కట్టుకోవడంతో అతడు పొరపడినాడు. ఆమె కూడా తన భర్త మాదిరిగా ఉండటంతో అలా ఎక్కేసింది. అయితే ఈ వ్యక్తి మాదిరే వెనుక కూర్చున మహిళ జంట కూడా పెట్రోల్ పోయించుకునేందుకు హెల్మెట్లు పెట్టుకుని అదే పెట్రలో బంకు వద్దకు వచ్చారు. ఆమె కూడా భర్త పెట్రోల్ కొట్టించేందుకు లోపలికి వెళ్లగా బయట ఎదురు చూస్తుంది.
ఇలా ఇద్దరు భర్తలు లోపలకి వెళ్లగా, వారి భార్యలు బంక్ బయట ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ వ్యక్తి ఇలా మరొకరి భార్యను తన బైక్ పై ఎక్కించుకుని వెళ్లాడు. అయితే తిరిగి ఆమెను పెట్రలో బంకు వద్దకు తీసుకొచ్చేసరికి.. అతడి భార్య, ఆమె భర్త, తమ వారు ఎటు పోయారా? అని అటు ఇటు చూస్తున్నారు. వీరిద్దరు బైక్ పై పెట్రలో బంకు వద్దకు రావడంతో అందరూ షాకయ్యారు. విషయం తెలుసుకున్న పెట్రోల్ బంకు సిబ్బంది కడుపుబ్బా నవ్వుకున్నారు. మరి..ఈ రియల్ కామెడీ సీన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.