సినీ ఇండస్ట్రీలో విలన్ గా నటించిన సోనూసూద్, రియల్ లైఫ్ లో రియల్ హీరో అనిపించుకున్నాడు. కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో సోనూ సూద్ ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారు. సాయం అని అడిగిన వారికి లేదనుకుండా సాయం చేస్తూ.. ఆపద్బాంధవుడిలా ఆదుకున్నారు. లాక్డౌన్ కారణంగా ఇబ్బందిపడిన లక్షలాది మందిని సొంతూళ్లకు చేర్చారు. ప్రవాసీ రోజ్గార్ అనే వెబ్సైట్ ద్వారా వలస కార్మికులకు ఉపాధి చూపించాడు. ప్రాంతం, భాష, కులం, మతం.. ఎలాంటి భేదాలు లేకుండా దేశం నలుమూలల నుంచి ఎవరు సాయం కోరినా చేసే సోనూసూద్.. తాజాగా మరోసారి మానవత్వం చాటుకున్నారు.
సోనూసూద్ మరోసారి మానవత్వం చాటుకున్నారు. రెండున్నరేళ్ల చిన్నారికి నాలుగు చేతులు కాళ్లు ఉన్న వీడియో వైరల్ అయింది. ఆ చిన్నారి కష్టాన్ని చూసి సోనూసూద్ చలించిపోయారు. ఆ చిన్నారిని ఆదుకునేందుకు ముందుకు వచ్చారు. నెవాడా జిల్లాకు చెందిన ఆ బాలిక వయస్సు రెండున్నరేళ్లు. పాపకు చికిత్స చేయించడానికి తమ వద్ద డబ్బులేదని దీనంగా ఒక చానెల్ ద్వారా తెలియజేయండో సోనూసూద్ అది చూసి తాను సహాయం చేస్తానని ముందుకు వచ్చాడు.
పాప గురించి పోస్ట్ చేసిన వీడియో చూసి చాలా మంది స్పందించారు.. ప్రభుత్వానికి విన్నపాలు చేశారు. సూనూసూద్ ఈ నేపథ్యంలో శనివారం బాలికకు డాక్టర్లు చికిత్స చేస్తున్న చిత్రాన్ని సోనూసూద్ పోస్ట్ చేశారు. పాపకు చికిత్స జరుగుతుంది.. ఎవరూ ఎలాంటి బాధ పడకండి.. పాప గురించి ప్రార్ధించండి అంటూ పేర్కొన్నారు. ఎలాంటి రక్త సంబంధం లేకున్నా అందరికీ సొంత మనిషిలా ఆదుకుంటున్న సోనూసూద్ సేవల గురించి మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
बिहार : नवादा जिले में एक ढाई साल की बच्ची के जन्म से ही चार हाथ और पैर
◆बच्ची की माता-पिता ने इलाज के लिए SDO कार्यालय पहुंचकर मदद की गुहार लगाई pic.twitter.com/2AYHCwINfm
— News24 (@news24tvchannel) May 27, 2022
टेन्शन मत लीजिए इलाज शुरू करवा दिया है। बस दुआ करिएगा। https://t.co/gndrRhuNQJ pic.twitter.com/YoCTRoqoir
— sonu sood (@SonuSood) May 28, 2022