సోనూసూద్.. కరోనా కష్టకాలంలో దేశవ్యాప్తంగా మారుమ్రోగిన పేరు. కరోనా సమయాంలో ఎక్కడికక్కడ చిక్కుకుపోయిన పేద ప్రజలను తన సొంత ఖర్చులతో బస్సుల ద్వారా వారి వారి ప్రాంతాలకు చేరవేశాడు. అదీకాక విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను ప్రత్యేక విమనాల్లో ఇండియాకు రప్పించి ఒక్కసారిగా సంచలనం సృష్టించాడు. ఇక ఆపదలో ఉండి సహాయం కోరి తన వద్దకు వచ్చిన వారికి లేదు అనకుండా చేయూత ఇస్తుంటాడు సోనూ భాయ్. ఇంత ఛారిటీ చేస్తున్న సోనూసూద్ కు వార్నింగ్ ఇచ్చారు రైల్వే పోలీసులు. దీనికి సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
సోనూసూద్.. సినిమా ఇండస్ట్రీకి విలన్ గా పరిచయం అయ్యాడు. కానీ నిజ జీవితంలో మాత్రం హీరో అనిపించుకుంటున్నాడు. సహాయం కోరి వచ్చిన వారికి తన వంతు చేయూతనందిస్తూ.. ముందుకు వెళ్తున్నాడు సోనూ భాయ్. కరోనా సమయంలో చేసిన సేవకు గానే సోనూసూద్ కు ఎన్నో అవార్డులు సైతం వచ్చాయి. కరోనా టైమ్ లోనే కాకుండా ఆ తర్వాత కూడా సమస్యల్లో ఉన్న ఎంతో మంది చిన్నారులకు సహాయం అందించాడు. అయితే తాజాగా అతడు సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ వీడియో వల్ల చిక్కుల్లో పడ్డాడు. ఆ వీడియోతో రైల్వే పోలీసుల నుంచి వార్నింగ్ ను సైతం అందుకున్నాడు సోనూసూద్.
ఇంతకి ఆ వీడియోలో ఏముందంటే? తాజాగా లోకల్ ట్రైన్ లో డోర్ వద్ద ఫుట్ బోర్డుపై వేలాడుతూ.. కూర్చున్నాడు సోనూ భాయ్. అప్పటికీ రైలు కదులుతూనే ఉంది. ఫుట్ బోర్డు దగ్గర ఉన్న హ్యాండిల్ ను పట్టుకుని, బయటకు చూస్తూ.. సోనూసూద్ ఎంజాయ్ చేశాడు. ఈ వీడియో వైరల్ కవడంతో అజాగ్రత్తగా ప్రయాణించడంపై సోనూసూద్ కు హెచ్చరికలు జారీ చేశారు సంబంధిత రైల్వే పోలీసులు. ఈ వీడియోను సోనూసూద్ డిసెంబర్ 13న తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ఈ వీడియో చూసిన చాలా మంది నెటిజన్స్..’యువతకు రోల్ మోడల్ గా ఉన్న మీరు ఇలాంటి పనులు చేయడం ఏంటి? సర్’ కదులుతున్న రైలులో ఇలా చేయడం తప్పు అని మరికొంత మంది నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేశారు.
— sonu sood (@SonuSood) December 13, 2022