రోడ్డుపై ఉండాల్సిన స్కూటీ గాల్లో ఎగిరి కరెంట్ వైర్ల మధ్యన చిక్కుకుంది. దీంతో అందరు షాక్ అవుతూ.. ఆ స్కూటీ అక్కడికి ఎలా వెళ్లింది అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. సరదా కామెంట్లతో వైరల్ చేస్తున్నారు నెటిజన్లు.
స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి వచ్చాక మనిషి జీవన శైలి మారిపోయింది. వాడుకున్నోళ్లకు వాడుకున్నంత అన్నట్టుగా స్మార్ట్ ఫోన్ వినియోగిస్తూ రక రకాల వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తూ ఫేమస్ అవుతున్నారు. అది ఏ విధమైన సంఘటనైనా క్షణాల్లో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. నెటిజన్స్ ఆ వీడియోల పట్ల స్పందిస్తూ రక రకాల కామెంట్స్ తో వైరల్ చేస్తున్నారు. ఇదే అంశానికి చెందిన విషయంలో ఓ స్కూటీ విద్యుత్ వైర్ల మధ్యన చిక్కుకుని అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. అసలు ఆ స్కూటీ అక్కడికి ఎలా ఎక్కింది అంటూ షాక్ అవుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
సాధారణంగా అయితే టూ వీలర్ పై వెళ్లేటపుడు అనుకోకుండా ప్రమాదం జరిగినపుడు వాహనం తో పాటు రోడ్డుపై పడిపోవడం జరుగుతుంది. దాంతో ఆ వ్యక్తికి గాయాలవుతాయి. ఆ వాహనానం కూడా దెబ్బతింటుంది. ఇదంతా రోడ్డు ప్రమాదంలో జరిగే విషయమే. అయితే ఇక్కడ మాత్రం ఓ స్కూటీ గాల్లో ఎగిరి విద్యుత్ వైర్లలో చిక్కుకుంది. ఇది చూసిన నెటిజన్స్ అయోమయానికి గురవుతున్నారు. అక్కడికి ఎలా చేరిందంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై స్పందిస్తూ కొంత మంది నెటిజన్లు కామెంట్లతో నవ్వులు పూయిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే..
జమ్మూలో కొద్ది రోజుల క్రితం బలమైన గాలులు వీచాయి. ఆ గాలుల ధాటికి స్కూటీ విద్యుత్ వైర్ల మధ్యన చిక్కుకున్నట్లు పలు వార్తా సంస్థలు కథనాలను వెలువరించాయి. ఆ స్కూటీ ఆక్సిడెంట్ కు గురైందా లేదా బలమైన గాలుల వల్లనే వైర్ల మధ్యలో చిక్కుకుందా అనే విషయం తెలియరాలేదు. వైరల్ అవుతున్న వీడియోలో ఆ స్కూటీ ఓ దుఖానానికి ఆనుకుని ఉన్న విద్యుత్ వైర్ల మధ్యలో చిక్కుకుని వేలాడుతోంది. ఇది నమ్మడానికి వీలు లేకున్నప్పటికి ఆ వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ట్విట్టర్ యూజర్ అయిన స్వాత్ కాత్ ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ.. స్కూటీని సేఫ్ ప్లేస్ లో పార్క్ చేయమని తండ్రి చెప్పినందుకు కూతురు అక్కడ పార్క్ చేసినట్లు ఫన్నీగా రాసుకొచ్చింది. దీనికి మరో వ్యక్తి స్పందిస్తూ ఎలక్ట్రిక్ స్కూటర్ కాబట్టి డైరెక్ట్ ఛార్జింగ్ కోసం అక్కడికి వెళ్లిందని కామెంట్ చేస్తున్నారు.
beta scooty kahi safe jageh par park kar dena
Didi : haanji papa pic.twitter.com/5l7pfR7nOB
— SwatKat💃 (@swatic12) June 20, 2023
maybe an electric scooter…..direct charging 😂😂
— Karthik ✪ (@_itz__karthik) June 20, 2023