దేశంలో ఇప్పటి వరకు ఎన్నో ప్రతిష్టాత్మక నిర్మాణాలు చేశారు. భారత దేశ నిర్మాణ రంగంలో మరో అద్భుత నిర్మాణం జరగబోతుంది... ఈ అద్భుతం భారత రైల్యే శాఖ తరఫున నమోదు కానుంది.
మన దేశంలో ఇప్పటి వరకు ఎన్నో అద్భుతమైన నిర్మాణాలు చేపట్టారు.. ఈ క్రమంలో దేశ నిర్మాణ రంగంలో మరో అద్భుతమైన చేరనుంది. భారత రైల్వేశాఖ మరో ఘనత సొంతం చేసుకుంది. జమ్మూ రాష్ట్రంలోని రైసీ జిల్లాలో దేశంలోనే తొలిసారి తీగల రైల్వే వంతెన ప్రారంభానికి సిద్దంగా ఉంది. కాట్రా, బనిమాల్ మధ్య 111 కిలో మీటర మీర ఈ మార్గాన్ని నిర్మించారు. ఇందుకు సంబంధించిన పనులు దాదాపు పూర్తి కావడానికి వచ్చాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..
భారత దేశంలో మరో అద్భుతమైన నిర్మాణం పూర్తి కావొచ్చింది. దేశంలోనే తొలిసారిగా తీగల వంతెన నిర్మాణం ప్రారంభానికి సిద్దంగా ఉంది. జమ్మూ రాష్ట్రంలోని రైసీ జిల్లాలో కాట్రా, బనిహాల్ మధ్య 111 కిలో మీటర్ల పొడవు ఈ ప్రాజెక్టు నిర్మితమవుతుంది. ఇందుకు సంబంధించిన పనులు తుది దశకు చేరుకున్నాయి. పదకొండు నెలల వ్యవధిలోనే ఈ రైల్వే వంతెన నిర్మాణం పూర్తయినట్లు కేంద్ర రైల్వే శాఖ అశ్విని వైష్ణవ్ ట్విట్టర్ వేధికగా తెలిపారు. ఈ వంతెన 96 ప్రధాన తీగలతో అనుసంధానించినట్లుతా ఆయన వెల్లడించారు. ఈ తీగల పొడవు 653 కిలో మీటర్ల మేరకు ఉంటుందని అన్నారు. ఈ వంతెనకు సంబంధించిన వీడియో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఈ ట్వీట్ పై ప్రధాని మోదీ స్పందిస్తూ.. ఎక్స్ లెంట్ అంటూ ప్రశంసించాడు.
ఈ వంతెన నిర్మాణం రూ.400 కోట్ల తో మొదలు పెట్టారు. చీనాబ్ నందిపై నిర్మిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్ కి ఎంతో విశిష్టత ఉంది. గంటకు 216 కిలో మీటర్ల వేగంతో వచ్చే గాలులను సైతం తట్టుగోగల సామర్థ్యం ఉంది. ఈ తీగల వంతెనపై సుమారు వంద కిలో మీటర్ల వేగంతో రైళ్లు ప్రాయాణించవొచ్చు. హిమాలయ పర్వతాలు మధ్య అంజీఖడ్ నదిపై దాదాపు 1086 అడుగుల ఎత్తులో దీన్ని నిర్మించారు. ఈ వంతెన అందుబాటులోకి వస్తే.. కశ్మీర్ వ్యాలీ మొత్తం రైల్వే నెట్ వర్క్ తో అనుసంధానం అవుతుంది. మొత్తానికి దేశంలో తొలిసారిగా తీగల వంతెన నిర్మాణానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
Anji-Khad Bridge!
First cable-stayed bridge (193 m height) of Indian Railways. pic.twitter.com/hwcnl5lrq8
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) January 30, 2023
Excellent! https://t.co/cwQpm6LVQX
— Narendra Modi (@narendramodi) April 29, 2023