90వ దశకంలో దేశానికి ఎన్నో విజయాలను అందించాడు సచిన్ టెండూల్కర్ . అవార్డులు, రివార్డులు ఆయన సొంతం మరో ఆటగాడు అందుకోలేని శిఖరం సచిన్ టెండూల్కర్. వన్డేలలో డబుల్ సెంచరీ చేసిన తొలి ఆటగాడు. అంతర్జాతీయ క్రికెట్లో వంద సెంచరీలు సాధించిన ఏకైక బ్యాట్స్మెన్ సచిన్ మాత్రమే. అలాగే 24 ఏళ్ల సుదీర్ఘ కెరీర్ కలిగి ఉన్నఒన్లీ వన్ క్రికెటర్ సచినే.
భారత్లో క్రికెట్ క్రీడకు వన్నె తెచ్చిన ఆటగాడు సచిన్ టెండూల్కర్. అందుకే భారత క్రీడాకారులకే కాదూ అభిమానులకు ఆయన మాస్టర్ బ్లాస్టర్. 16 ఏళ్లకే అతి పిన్న వయస్సులోనే వన్డే క్రికెట్లోకి అడుగుపెట్టారు. 90వ దశకంలో దేశానికి ఎన్నో విజయాలను అందించాడు. అవార్డులు, రివార్డులు ఆయన సొంతం మరో ఆటగాడు అందుకోలేని శిఖరం సచిన్ టెండూల్కర్. వన్డేలలో డబుల్ సెంచరీ చేసిన తొలి ఆటగాడు. అంతర్జాతీయ క్రికెట్లో వంద సెంచరీలు సాధించిన ఏకైక బ్యాట్స్మెన్ సచిన్ మాత్రమే. అలాగే 24 ఏళ్ల సుదీర్ఘ కెరీర్ కలిగి ఉన్నఒన్లీ వన్ క్రికెటర్ సచినే. 1989లో జాతీయ జట్టుకు ఎంపికైన సచిన్ 2013 వరకు విరామం లేకుండా క్రికెట్ ఆడాడు. అత్యధిక టెస్టు మ్యాచ్లు ఆడిన క్రికెటర్ సచిన్(200 టెస్టులు) కావడం గమనార్హం. అత్యధిక ఫోర్లు కొట్టిన మొనగాడు ఆయనే.
క్రీడకు గుడ్ బై చెప్పాడు కానీ, బ్యాడ్మింటన్ లీగ్ ISLలో.. కేరళ బ్లాస్టర్స్, బెంగళూరు బ్లాస్టర్స్ ఫ్రాంచైజీలకు సహ యజమానిగా వ్యవహరిస్తున్నారు టెండూల్కర్. ఇతర వ్యాపారాలు ఉన్నాయి. అయితే ఆయన ఆస్తుల విలువ 2022 లెక్కల ప్రకారం రూ. 1350 కోట్లు. అత్యధికంగా సంపాదిస్తున్న క్రీడాకారుల జాబితాలో సచిన్ టెండూల్కర్ 51వ స్థానంలో ఉన్నారు. అయితే వీటిలో ఖరీదైన ఇళ్లు, కార్లు ఉన్నాయి. సచిన్ టెండ్యూలర్కు కార్లంటే మహా ఇష్టం. అందుకే ఆయన దగ్గర విలాసవంతమైన కార్లు ఉంటాయి. ఈ క్రికెటర్ మొదటిసారి కొన్న కారు మారుతి 800. ప్రస్తుతం అత్యంత ఖరీదైన బెంజ్, ఆడి, బీఎండబ్ల్యూ లగ్జరీ కార్లు, పోర్షే వంటి కార్లు సచిన్ గ్యారేజీలో అనేకం ఉన్నాయి. కేవలం సచిన్ కోసమే ప్రత్యేక ఫీచర్లతో వీటిని తయారు చేశారు. టెండూల్కర్ వద్ద ఉన్న కార్ల ఖరీదు 15 కోట్ల రూపాయల కంటే ఎక్కువేనన్నది ఒక లెక్క.
ఇప్పుడు ఈ గ్యారేజీలో మరో ఆటో మొబైల్ కారు చేరింది. అదే లంబోర్ఘిని. ఇటీవల మార్కెట్ లోకి వచ్చిన ఉరుస్ ఎస్ పై మనసు పారేసుకున్న ఈ క్రికెట్ మాజీ దిగ్గజం.. ఈ ఖరీదైన కారును కూడా కొనుగోలు చేశారు. దీని ధర అక్షరాలా రూ. 4.18 కోట్లట. అంత ఖర్చు పెట్టి కొన్నారంటే.. ప్రత్యేకతలు ఉంటేనే కదా.. దీని ఉన్న ప్రత్యేకతలేంటంటే.. ఉరుస్ ఎస్ కారు ఎయిర్ సస్పెన్షన్ సిస్టమ్తో నడుస్తుంది. నడిపే వ్యక్తులకు మెరుగైన డ్రైవింగ్ అనుభవాన్ని అందిస్తుంది. ఈ అధునాతన ఫీచర్ ఎడ్జస్టబుల్ హైట్, రహదారిపై అసమానమైన సౌకర్యాన్ని అందిస్తుంది. అంతేకాకుండా, ఉరుస్ S మూడు ఆఫ్-రోడ్ మోడ్లను కలిగి ఉంది, సబ్బియా (ఇసుక), నీవ్ (స్నో) మరియు టెర్రా (మడ్) వివిధ భూభాగాల్లో సాఫీగా ప్రయాణించేలా చేస్తుంది. అంటే ఇసుక, మట్టి రోడ్డుల్లో కూడా రయ్ మంటూ దూసుకెళుతుందన్నమాట