భారత రాష్ట్రపతి 2020 సంవత్సరానికి గానూ పద్మశ్రీ అవార్డులు ప్రదానం చేశారు. 2020కి గాను మొత్తం 61 మందికి పద్మ శ్రీ అందజేశారు. వారిలో అందరినీ ఆశ్చర్యపరిచినది.. అందరి దృష్టిని ఆకర్షించిన వ్యక్తి తులసి గౌడ(76). ఆవిడ చేసిన సామాజిక సేవకు పద్మశ్రీ అవార్డు దక్కింది. ఆవిడకు అక్షరం ముక్కరాదు. కానీ, అడవిలోని చెట్ల గురించి గుక్కతిప్పుకోకుండా మాట్లాడగలదు. అందుకే ఆమెకు ‘ఎన్ సైక్లోపీడియా ఆఫ్ ఫారెస్ట్’ అనే పేరు కూడా వచ్చింది. ఏ మొక్క ఎందుకు ఉపయోగపడుతుంది. ఆ మొక్క జీవితకాలం ఎంత? దానికి ఏ రకం ఎరువులు ఉపయోగిస్తే బాగా పెరుగుతుంది.. వంటి విషయాలను ఇట్టే చెప్పేస్తుంది.
Some more glimpses from the ceremony held this evening. pic.twitter.com/GEELhMyHdI
— Narendra Modi (@narendramodi) November 8, 2021
ఈవిడ కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలోని ఓ గ్రామంలో జన్మించారు. ఆవిడది హలక్కీ గిరిజన కుటుంబం. అంతేకాదు.. ఆవిడ ఇప్పటివరకు 30 వేల మొక్కలు నాటారు. పర్యావరణ ప్రేమికురాలిగా ఆవిడ దాదాపు 60 ఏళ్లుగా తన జీవితాన్ని కొనసాగిస్తున్నారు. అవార్డును అందుకునేందుకు సాంప్రదాయ దుస్తుల్లో వచ్చారు. అవార్డును అందుకునేందుకు వెళ్లేటప్పుడు మధ్యలో ఆగి ప్రధాని మోదీకి అభివాదం చేసి వెళ్లారు. అవార్డును అందుకున్న తర్వాత కూడా ప్రధాని మోదీ తులసి గౌడతో ఆప్యాయంగా ముచ్చటించారు. తులసి గౌడ గురించి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ట్వీట్ ద్వారా తెలియజేశారు.
Attended the Padma Awards ceremony earlier this evening. Congratulations to those who have been conferred the #PeoplesPadma. pic.twitter.com/DUpuO1YC4Z
— Narendra Modi (@narendramodi) November 8, 2021
తులసి గౌడ నిరుపేద కుటుంబంలో జన్మించారు. తన రెండేళ్ల వయసులోనే తండ్రి మరణించారు. తల్లితో కలిసి స్థానిక నర్సరీలో పనికి వెళ్లారు. పన్నెండేళ్లలకే వివాహం చేసుకున్నారు. అనుకోని కారణాలరీత్యా భర్త కొంతకానికే మరణించారు. ఆ సంఘటనతో కుంగిపోయిన తులసి అడవిలోని మొక్కలతో స్నేహం చేయడం ప్రారంభించింది. ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ లో వాలంటీర్‌గా పనిచేయడం ప్రారంభించింది. తన అంకితభావాన్ని గుర్తించిన కర్ణాటక ప్రభుత్వం ఆమెకు శాశ్వత ఉద్యోగాన్ని ఇచ్చారు. ఉద్యోగం నుంచి రిటైర్మెంట్ అయ్యారే గానీ మొక్కలకు.. తులసి గౌడకు విడదీయలేని బంధం ఏర్పడింది. తన జ్ఞానాన్ని యువతతో పంచుకుంటోంది. పర్యావరణ రక్షకు కృషి చేయాలంటూ సందేశాన్ని తులసి గౌడ స్పష్టంగా రాబోయే తరాలకు చేరవేస్తున్నారు.
President Kovind presents Padma Shri to Smt Tulsi Gowda for Social Work. She is an environmentalist from Karnataka who has planted more than 30,000 saplings and has been involved in environmental conservation activities for the past six decades. pic.twitter.com/uWZWPld6MV
— President of India (@rashtrapatibhvn) November 8, 2021