పెళ్ళై అన్యోన్యంగా జీవిస్తున్న కుటుంబం. భర్త, పిల్లలతో వారి లైఫ్ హ్యాపీగా సాగుతోంది. మంచి జీతంతో వారి జీవితం కూడా సుఖసంతోషాలతో విరాజిల్లుతోంది. అంతలోనే పచ్చని కుటుంబంలో అడుగు పెట్టి విషాదం నింపేసాడు ఓ వ్యక్తి. అసలు ఆ వ్యక్తి చేసిన పనేంటి.? ఎందుకు వాళ్ళ జీవితాలు నాశనమయ్యాయి అనేది తెలుసుకుందాం.
ఇక వివరాల్లోకి వెళితే…గుజరాత్‌లోని ఎల్లిస్ బ్రిడ్జ్ ప్రాంతంలోని భూదార్‌పూర్‌లో నివాసముంటున్నారు ఓ భార్య భర్తలు. ఆర్తీ అనే యువతితో విష్ణుభాయ్‌కి ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. అన్యోన్యమైన జీవితాన్ని కొనసాగిస్తున్నారు. వారికి ఇద్దరి మగ పిల్లలు కూడా జన్మించారు. భర్త జీతంతో పాటు ఆర్తి కుటుంబ జీవితం కూడా హాయిగా సాగుతుంది. ఇక అంతలోనే ఆర్తికి దినేష్ అనే ఓ వ్యక్తి ప్రేమిస్తున్నాను అంటూ లవ్ ప్రపోజల్ పంపాడు. దీనికి ఆ యువతీ నిరాకరించింది. అలా ప్రతి రోజు వెంట తిరుగుతూనే ఉన్నాడు. ఆర్తికి వన్ సైడ్ లవ్ అంటూ వేధిస్తూ…వెంట తిరిగేవాడు.
దినేష్ ఇబ్బందుల భరించలేక ఎక్కడికెక్కడికో నివాసాలు మార్చినా వెత్తుకుంటూ అక్కిడ వాలిపోయేవాడు. అలా ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చి ప్రేమించాలని వెంటపడుతూనే ఉన్నాడు. ఒక రోజు ఆర్తి ఇంటికి వచ్చి నా వెనకాల బయటకు రావాలి.. లేకుంటే మీ కుటుంబ సభ్యులను చంపుతానని బెదిరించాడు. దీంతో భయపడి పోయిన ఆ యువతి దినేష్ వెంబడి వెళ్లింది. అలా కొన్ని రోజులు గడిచింది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే..దినేష్‌తో భయటకు వెళ్లిన ఆర్తి విషయం భర్త విష్ణుభాయ్‌కి తెలిసిందే.
అవాక్కైన భర్త దీంతో దీని గురుంచి ఆరా తీశాడు. ఇక ఏం చేయాలో తెలియక తన మామ అయిన ఆర్తి తండ్రికి ఈ విషయం అంతా పుసుగుచ్చినట్లు వివరించాడు. దీంతో ఆర్తి తండ్రి ఆమెను మందలించడం మొదలుపెట్టాడు. ఇటు దినేష్ వేదింపులు, ఇటు భర్త, తన తండ్రి నుంచి అనుమనాలు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయం తీసుకుంది. ఇక ఎవరు లేని సమయంలో అపార్ట్‌మెంట్ పైకి ఎక్కి పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల గుజరాత్‌లో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచనలంగా మారింది.