క్రికెట్ అంటే అభిమానించని వారు ఉండరు.. చిన్న, పెద్దా అనే తేడా లేకుండా క్రికెట్ మ్యాచ్ ఉందంటే చాలు టీవీలకు అతుక్కుపోతారు. అయితే ఈ మద్య క్రికెట్ మైదానంలో పలు విషాదాలు వెలుగులోకి వచ్చాయి. క్రికెట్ మైదానంలో యువ ఆటగాళ్లు కన్నుమూస్తున్నారు.
మనిషి ప్రాణం ఎప్పుడు ఎలా పోతుందో ఎవరూ ఊహించలేరు. అప్పటి వరకు మన మధ్య సంతోషంగా ఉన్నవారు అకస్మాత్తుగా మనముందే కుప్పకూలిపోయి చనిపోయిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. ఈ మద్య పలువురు సెలబ్రెటీలు, సామాన్యులు అకస్మాత్తుగా గుండెపోటుతో కుప్పకూలిపోయిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. తాజాగా ఓ యువ క్రికెట్ ఆటగాడు ఫీల్డింగ్ చేస్తూ గ్రౌండ్ లో కుప్పకూలిపోయాడు. ఈ ఘటన గుజరాత్ లో చోటు చేసుకుంది.
గుజరాత్ క్రికెట్ లో విషాదం నెలకొంది. అహ్మదాబాద్ లో కొంత మంది ఉద్యోగుల మద్య ఓ క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది. ఈ క్రమంలో జీఎస్టీ ఉద్యోగి అయిన వసంత్ రాథోడ్ (34) గ్రౌండ్ లో ఫీల్డింగ్ చేస్తూ హార్ట్ ఎటాక్ రావడంతో కుప్పకూలిపోయాడు. ఇది గమనించిన తోటి ఆటగాళ్లు వెంటనే స్పందించి అతన్ని దగ్గరలోని ఆస్పత్రికి తీసుకు వెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ రాథోడ్ కన్నుమూశాడు. మృతుడు వసంత్ రాథోడ్ కి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
ఇటీవల క్రికెట్ మైదానంలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ మద్యనే రాజ్ కోట్ లో ప్రశాంత్ భరోలియా ఇతని వయసు 27 సంవత్సరాలు.. సూరత్ లో జిగ్నేష్ చౌహాన్ వయసు 31 సంవత్సరాలు గుండెపోటుతో మరణించారు. కొన్నిసార్లు క్రికెట్ మైదానంలో బంతి తగిలి మైదానంలో మృతి చెందినవారు ఉన్నారు. క్రికెట్ లో హెల్మెట్ సహా ఇతర రక్షణ పరికరాలు ఉపయోగిస్తున్నప్పటికీ కొన్నిసార్లు అనుకోని ఘటనల వల్ల ఆటగాళ్లు చనిపోతున్న విషయం తెలిసిందే. యువ క్రికెట్ వసంత్ రాథోడ్ మృతి పట్ల క్రికెట్ అసోసియేషన్, పలు క్రీడాకారులు నివాళులర్పించారు.