వివిధ రంగాలకు చెందిన కొందరు తమదైన ప్రతిభతో ప్రజల మనస్సును గెలుచుకుంటారు. అంతేకాక ప్రముఖలల్లో అతి తక్కువ మంది మాత్రమే చనిపోయిన తరువాత కూడా ప్రజల గుండెల్లో చిరంజీవులుగా ఉంటారు. అయితే కొన్ని చోట్ల అయితే ప్రజల మదిలో నిలిచిన వ్యక్తులు, సమాజానికి స్ఫూర్తిగా ఉండే వ్యక్తుల జీవిత చరిత్రలను పాఠ్యపుస్తకాలో సైతం చేర్చారు. భవిషత్యులో దేశానికి ఉత్తమ పౌరులుగా నిలిచే విద్యార్ధులకు.. ప్రముఖల జీవిత చరిత్రలే ఆదర్శంగా. తాజాగా కర్ణాటక ప్రభుత్వం పవర్ స్టార్ డాక్టర్ పునీత్ రాజ్ కుమార్ జీవిత చరిత్రను.. ఆ రాష్ట్ర భాషా పాఠ్య పుస్తకంలో పొందుపరిచారు. పవర్ స్టార్ అభిమానుల కోరిక మేరకు, ఆయన గౌరవార్ధం కర్ణాటక ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. బెంగళూరు యూనివర్శిటీ అధికారులు కన్నడ పాఠ్య పుస్తకంలో పునీత్ జీవితం నుండి ఒక సారాంశం సేకరించి కన్నడ పాఠ్యపుస్తకంలో పొందుపరిచారు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే..
కన్నడ పవర్ స్టార్, కన్నడ రత్న డాక్టర్ పునీత్ రాజ్ కుమార్ మరణించి దాదాపు 14 నెలలు.. ఇంకా ఆయన మరణాన్ని చాలా మంది అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు. పునీత్ రాజ్ కుమార్ కు కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. సినిమాలతోనే కాకుండా సమాజా సేవ చేస్తూ కన్నడ ప్రజల గుండెల్లో పునీత్ రాజ్ కుమార్ దేవుడిలా ఉండిపోయారు. అనేక మంది పేద పిల్లలు పునీత్ ఆర్థిక సాయం చేశారు. అలానే పేదవారిని ఆదుకోవడంలో పునీత్ రాజ్ కుమార్ ముందుంటారు. ఇలా కోట్లాది మంది ప్రజల మనస్సులో దైవంగా నిలిచిన పునీత్ రాజ్ కుమార్ 2021 అక్టోబర్ 29 ఉదయం గుండెపోటుతో మరణించారు. ఆయన మరణంతో కర్ణాటక అంతట విషాదా ఛాయాలు అలుముకున్నాయి. ఆయన మరణాన్ని జీర్ణించుకోలేక కొన్ని గుండెలు సైతం ఆగిపోయాయి.
ఇక ఆయన గౌరవార్ధం కర్ణాటక ప్రభుత్వం పలు అవార్డులతో సత్కరించింది. అలానే పలు సంస్థలకు, ప్రాంతాలకు ఆయన పేరును పెట్టారు. ఇటీవలే డాక్టర్ పునీత్ రాజ్ కుమార్ కు కన్నడ రత్న అవార్డుతో కర్ణాటక ప్రభుత్వం సత్కరించింది. తాజాగా పవర్ స్టార్ అభిమానుల కోరిక మేరకు పాఠ్యపుస్తకాలో సైతం పునీత్ జీవిత చరిత్రను పొందుపరిచారు. పునీత్ రాజ్ కుమార్ జీవిత చరిత్రను కన్నడ పాఠ్యపుస్తకంలో పొందుపరచాలని ఆయన అభిమానులు కోరుకున్నారు. ఈమేరకు పునీత్ అభిమాన సంఘాలు కర్ణాటక ప్రభుత్వానికి లేఖ రాశాయి. అలానే ఆ రాష్ట్ర విద్యాశాఖమంత్రిని కలిసి రాజ్ కుమార్ అభిమానులు వినతి పత్రం సమర్పించారు. బెంగుళూరు విశ్వవిద్యాలయం డిగ్రీ బీకామ్ మూడవ సెమ్ లో వాణిజ్య కన్నడ-3లో పవర్ స్టార్ జీవితం నుండి ఒక సారాంశాన్ని పొందుపరిచింది.
అంతకుముందు గతంలో బెంగళూరు యూనివర్శిటీ కూడా తన గ్రాడ్యుయేషన్ థీసిస్లో శరణు హళ్లూర్ రాసిన ‘నేనే రాజకుమార’లోని లోహిత్ ఎంబా మరిముడు అధ్యాయాన్ని ఉపయోగించింది. కర్టాటక ప్రభుత్వం, బెంగళూరు విశ్వవిద్యాలయం కర్టాటక రత్న పునీత్ రాజ్ కుమార్ జీవిత చరిత్రను కన్నడ పాఠ్యపుస్తకాల్లో పొందుపరచడంతో ఆయన కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్బంగా ప్రభుత్వానికి, విశ్వవిద్యాలయ అధికారులకు పునీత్ రాజ్ కుమార్ అభిమానులు కృతజ్ఞతలు చెబుతున్నారు. మరీ.. పాఠ్యపుస్తకంలో పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ జీవిత చరిత్రను పొందుపర్చడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.