ఈ మధ్యకాలంలో బెదిరింపు లేఖలు కలకలం సృష్టిస్తున్నాయి. ఇటీవల ప్రధానికి టెర్రర్ గ్రూప్ నుంచి బెదిరింపు లేఖలు వచ్చినట్లు వార్తలు వచ్చాయి. తాజాగా కర్ణాటకలో కొందరు దుండగులు.. రాజకీయ ప్రముఖులకు లేఖలు పంపండం కలకలం రేపింది. ఈ లేఖలు అందుకున్నవారిలో మాజీ సీఎంలు సిద్ధరామయ్య, హెచ్ డీ కుమరా స్వామి ఉన్నారు. వారితో పాటు దాదాపు 61 మంది ప్రముఖలను చంపేస్తామంటూ దుండగులు ఈ లేఖలు రాశారు. ఈ 61 మంది దేశ ద్రోహులని ఆ లేఖల్లో ఆరోపించారు. ఇప్పుడు ఈ లేఖలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
ఓ వర్గానికి మద్దతు తెలుపుతూ, మరో వర్గంపై ఆయా ప్రముఖులు విమర్శలు చేస్తున్నారని ఆ లేఖల్లో ఆరోపించారు. సిద్ధరామయ్య, కుమారస్వామి సహా 61 మంది ఏ క్షణంలోనైనా మృత్యువు చేరవచ్చని దుండగులు హెచ్చరించారు. వారి చివరి యాత్రకు వారి కుటుంబ సభ్యులు సిద్ధంగా ఉండాలని లేఖల్లో పేర్కొన్నారు. ఆ లేఖలపై మాజీ సీఎం హెచ్‌డీ కుమారస్వామి స్పందిస్తూ.. ఈ విషయాన్ని ప్రభుత్వం సిరీయస్ తీసుకోవాలని తెలిపారు. ఈ లేఖల పై ప్రభుత్వానికి మరింత సమాచారం అందిస్తానని కుమారస్వామి అన్నారు. బెదిరింపు లేఖలు అందుకున్న రచయితలకు కూడా వెంటనే భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. తాను భగవంతుడిని నమ్ముతానని, తనకు ఎలాంటి భయాలు లేవని కుమారస్వామి చెప్పారు. అయితే అంతమందికి ఒకేసారి బెదిరింపుల లేఖలు రావడం చర్చనీయాంశమైంది. మరి.. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.