మిస్ యూనివర్స్ కిరీటాన్ని అందుకోవాలన్న 21 ఏళ్ల సుదీర్ఘ ఎదురుచూపులకు తెర పడింది. తాజాగా విశ్వసుందరి కిరీటాన్ని భారత్ యువతి హర్నాజ్ కౌర్ సంధు గెలుచుకుంది. ఇజ్రాయిల్ లోని ఇలాట్ నగరంలో జరిగిన 70వ మిస్ యూనివర్స్ పోటీల్లో 80 మంది పాల్గొనగా.. హర్నాజ్ కౌర్ విజేతగా నిలిచింది. దీంతో 21 ఏళ్ల తర్వాత భారత్కు మిస్ యూనివర్స్ కిరీటం దక్కింది. 1994లో సుస్మితాసేన్, 2000లో లారాదత్త విశ్వసుందరి కిరీటాన్ని గెలిచారు. తాజాగా 2021 లో మూడోసారి విశ్వసుందరి కిరీటం హర్నాజ్ కౌర్ ద్వారా భారత్ గెలిచింది. సోషల్ మీడియాలో హర్నాజ్ కౌర్ వివరాల కోసం వెతుకులాట మొదలు పెట్టారు. హర్నాజ్ కౌర్ విశ్వసుందరి కిరీటం ఎలా దక్కించుకుంది. ఆమె ప్రయాణంలో ఎదురైన సవాళ్ల గురించి పూర్తి వివరాలు.
తను ఎదుర్కొన్న అవమానాలను, విమర్శలను మెట్లుగా మార్చుకొని ఆత్మవిశ్వసంతో ముందడుగు వేసి నేడు విశ్వవిజేత నిలిచారు హర్నాజ్ కౌర్. ” నువ్వు సన్నగా ఉంటావు, మరీ అంత అందగా ఏమి లేవు” వంటి అనేక రకమైన అవమానాలు, విమర్శలు ఎదుర్కొన్నట్లు కౌర్ తెలిపారు. ప్రస్తుతం ఈ అమ్మడు.. ఓ వైపు అందాల పోటీల్లో పాల్గొంటూనే మరోవైపు చదువు కొనసాగిస్తోంది.
పంజాబ్ రాష్ట్రంలోని చండీఘర్ లో 2000 డిసెంబర్ 3 న రుబి సంధు, పీఎస్ సంధు దంపతులకు హర్నాజ్ కౌర్ సంధు జన్మించారు. హర్నాజ్ కు చిన్నతనం నుంచి మోడలింగ్ పై ఆసక్తి ఎక్కువ. వెండి తెరపై రాణించాలనేది ఆమె కోరిక. దానికోసం విద్యార్థి దశ నుంచే మోడలింగ్ లో శిక్షణ తీసుకుంది. తనకు వాళ్ల అమ్మ సపోర్టు గా నిలిచేది. 17ఏళ్ల వయసులో మోడలింగ్ ప్రారంభించిన హర్నాజ్ ఇప్పటివరకు 2017లో టైమ్స్ ఫ్రెష్ ఫేస్ మిస్ చండీగఢ్, 2018లో మిస్ మ్యాక్స్ ఎమర్జింగ్ స్టార్, 2019లో ఫెమినా మిస్ ఇండియా పంజాబ్, మిస్ దివా 2021, ఇప్పుడు 2021లో మిస్ యూనివర్స్ కిరీటాన్ని అందుకుంది.
చిన్నతనంలో సన్నగా గాలొస్తే ఎగిరిపోయెలా ఉండడంతో.. తోటివారు చేసే హేళనకు భరించింది.
హర్నాజ్ తల్లి ప్రముఖ గైనకాలజిస్ట్. ఆమె స్ఫూర్తితోనే తను ఈ విజయం సాధించానన్నారు కౌర్. మోడలింగ్ లోకి రావలనుకున్నప్పుడు అమ్మే తనకు మార్గదర్శం చేసిందని..నిత్యం వెన్నంటే ఉండి తనను ప్రోత్సహించిందని హర్నాజ్ ఓ సందర్భంలో తెలిపారు. హర్నాజ్ కౌర్ ప్రస్తుతం పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లో పీజీ చేస్తున్నారు. ప్రయాణాలు చేయడం చాలా ఇష్టంమని, సరదాకు అప్పుడప్పుడు గుర్రపు స్వారీ చేస్తుంటానని తెలిపారు. అయితే హర్నాజ్ సంధు యారా దియాన్ పో బరన్, బై జీ కుట్టంగే అనే పంజాబీ సినిమాల్లోనూ ఈ అమ్మడు హీరోయిన్ గా నటించింది. ఈ విశ్వసుందరి జీవితం ప్రయాణంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.