2020 ఏడాదికి మిస్ యూనివర్స్ కిరీటాన్ని మెక్సికో యువతి 26 ఏళ్ళ ఆండ్రియా మెజా గెలిచారు. మిస్ యూనివర్స్ 69వ ఎడిషన్‌లో మొత్తం 74 దేశాలకు చెందిన సుందరాంగులు పోటీ పడగా మెజా విజేతగా నిలిచారు. అమెరికాలోని హాలీవుడ్‌లో ఉన్న సెమినోల్ హార్డ్‌రాక్ హోటల్,క్యాసినోలో ఆదివారం రాత్రి విశ్వ సుందరి పోటీలు జరిగాయి. పోటీలో భారతీయ యువతి, మిస్ ఇండియా 24 ఏళ్ళఅడ్‌లైన్ కాస్టెలినో విజయానికి చేరువగా వచ్చారు. 4వస్థానంలో (థర్డ్ రన్నరప్) నిలిచారు. మెజాకు 2019 విశ్వసుందరి జోజిబినీ టూన్జీ మిస్ యూనివర్స్ కిరీటాన్ని అలంకరించారు. ఫస్ట్ రన్నరప్‌గా(రెండో స్థానంలో) బ్రెజిల్ యువతి 28 ఏళ్ళజూలియా గామా సెకండ్ రన్నరప్‌గా(మూడో స్థానంలో) పెరూ యువతి 27 ఏళ్ళజనిక్ మాసెటా నిలిచారు. ఇక దక్షిణాఫ్రికాకు చెందిన మాజీ మిస్ యూనివర్స్(2019) జోజిబినీ తుంజీ విజేత ఆండ్రియాకు కిరీటం అలంకరించారు. కాగా మొత్తం డెబ్బై మందికి పైగా పాల్గొన్న ఈ పోటీలో విజయం సాధించారని ప్రకటించగానే ఆండ్రియా తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. కన్నీటి పర్యంతమవుతూనే క్యాట్‌వాక్ పూర్తి చేశారు.
ఆండ్రియా మెజా – మెక్సికోని చిహువాకు చెందినవారు. సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్‌లో పట్టా పుచ్చుకున్నారు. మోడలింగ్‌పై ఆసక్తి గల ఆమె చిహువా టూరిజం బ్రాండ్ అంబాసిడర్‌గా ఉంటూ తమ సంస్కృతీ సంప్రదాయాల గురించి ప్రపంచానికి చాటిచెబుతున్నారు. అంతేగాకుండా, మహిళా హక్కులపై ఉద్యమిస్తూ లింగ వివక్షకు వ్యతిరేకంగా పోరాటం సాగిస్తున్నారు. ఇక సర్టిఫైడ్ మేకప్ ఆర్టిస్టు మోడల్ అయిన ఆండ్రియాకు క్రీడల అంటే కూడా ఆసక్తి. జంతు హింసను తట్టుకోలేని ఆమె వీగన్‌గా మారిపోయారు. పూర్తి శాకాహారమే తీసుకుంటున్నారు. కాగా మెక్సికో నుంచి మిస్ యూనివర్స్‌గా ఎంపికైన మూడో మహిళగా ఆండ్రియా నిలిచారు. అంతకు ముందు లుపితా జోన్స్(1991), షిమెనా నవరటె(2010) ఈ విశ్వ సుందరీమణులుగా నిలిచారు.