గగన తలంలో యుద్ధం చేసే యుద్దవిమానం యొక్క ఇంధన ట్యాంకర్ పొలాల్లో పడిపోయింది. దీంతో స్థానికులు ఉక్కిరిబిక్కిరయ్యారు. ఇంధన ట్యాంకర్ కావడంతో ఏ ప్రమాదం జరుగుతోందో అని భయంతో వణికిపోయారు.
త్రివిద దళాలైన ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దేశ రక్షణలో కీలక పాత్ర వహిస్తాయి. చొరబాటు దారులను, తీవ్రవాదులను దేశంలోకి రాకుండా, వారి చర్యలను అడ్డుకుని దేశ సంపదను, పౌరులను రక్షిస్తుంటాయి. ఇందులో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ భారత గగన తలాన్ని రక్షిస్తూ ఉంటుంది. శత్రు దేశాల నుంచి గగన తలం ద్వారా భారత్ లోకి ప్రవేశించే డ్రోన్లు, క్షిపణులను నిలువరించి దేశ రక్షణలో పాలుపంచుకుంటోంది భారత వైమానిక దళం. కాగా ఓ రాష్ట్రంలో ఎయిర్ ఫోర్స్ కు చెందిన విమానం నుంచి ఇంధన ట్యాంక్ పంటపొలాల్లో పడిపోయింది. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఆ వివరాలు మీకోసం..
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ శత్రు దేశాలతో యుద్ధం చేయాల్సిన పరిస్థితులు తలెత్తినప్పుడు వైమానిక యుద్ధాన్ని నిర్వహిస్తాయి. యుద్ధ విమానాలను నడిపే పైలట్ లకు శిక్షణా కార్యక్రమాలు చేపడుతుంది ఐఏఎఫ్. తాజాగా శిక్షణలో భాగంగా బయలుదేరిన ఐఏఎఫ్ జాగ్వార్ జెట్ కు చెందిన యుద్ధవిమాన ఇంధన ట్యాంకర్ యూపీలోని కబీర్ నగర్ జిల్లాలోని పంటపొలాల్లో పడిపోయింది. దీంతో స్థానికులు, రైతులు ఆందోళనకు గురయ్యారు.
వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో అక్కడకు చేరుకున్న అధికారులు ఆ ట్యాంకర్ భారత వాయుసేనకు చెందినదని గుర్తించి సంబంధిత అధికారులకు సమాచారం అందించారు. దీంతో ఎయిర్ ఫోర్స్ బృందం ఘటనా స్థలానికి చేరుకుని ఇంధన ట్యాంక్ ను గుర్తించింది. శిక్షణా విమానంలో చోటుచేసుకున్న సాంకేతిక లోపం కారణంగా అడిషనల్ గా ఉన్న ఇంధన ట్యాంక్ ను పైలట్ క్రిందికి జారవిడిచినట్లు తెలిపారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ఆస్థి, ప్రాణ నష్టాలు జరగలేదని అధికారులు వెల్లడించారు.
A fighter aircraft was airborne for a training mission from Gorakhpur. The aircraft experienced technical malfunction which necessitated jettisoning of external stores. There was no damage to life or property in the process.
— CAC, IAF (@CAC_CPRO) July 24, 2023