సాధారణంగా ఏదైనా గొప్ప పని చేసినపుడు, నలుగురు మెచ్చే పని చేసినపుడు సన్మానాలు చేయటం పరిపాటి. ఆయా వ్యక్తులు సాధించిన గొప్ప పనులను బట్టి వారికి చేసే సన్మానాల్లో తేడా ఉంటుంది. అయితే, తప్పుడు పనులు చేసే వారికి సన్మానాలు చేయటం అన్నది అసాధ్యం. కానీ, ఈ అసాధ్యాన్ని ఉత్తర ప్రదేశ్ జైలు అధికారులు సుసాధ్యం చేశారు. జైలు నుంచి విడుదల అవుతున్న ఓ వృద్ద ఖైదీకి ఘనంగా సన్మానం చేశారు. ఇంతకీ జరిగిందేంటంటే.. ఉత్తర ప్రదేశ్, అయోధ్యకు చెందిన 98 ఏళ్ల రామ్ సూరత్ కొన్నేళ్ల క్రితం ఏదో కేసులో జైలు పాలయ్యాడు. అయోధ్య జిల్లా జైలులో శిక్ష అనుభవిస్తూ ఉన్నాడు.
ఈ నేపథ్యంలోనే తాజాగా, అతడి శిక్షా కాలం ముగిసింది. విడుదల అవుతున్నట్లు జైలు అధికారులు అతడికి చెప్పారు. రామ్ సూరత్ విడుదల అయ్యేరోజు రానే వచ్చింది. అయితే, అతడ్ని ఇంటికి తీసుకెళ్లటానికి ఎవ్వరూ రాలేదు. దీంతో జైలు సూపరింటెండెంట్ శశికాంత్ మిశ్రా వృద్ధుడి పరిస్థితి చూసి చలించిపోయారు. జైలు నుంచి విడుదలవుతున్నందుకు గానూ రామ్ సూరత్‌కు ఘన సన్మానం చేశాడు. కొంత డబ్బుతో పాటు బట్టలు కూడా పెట్టాడు. కారులో అతడ్ని ఊరికి పంపించేందుకు ఏర్పాట్లు చేశాడు. కారు దగ్గరి వరకు ఎస్కార్ట్ సైతం పెట్టాడు. అతడిని కారులో ఊరికి పంపించాడు.
కాగా, రామ్ సూరత్ 2022, ఆగస్టు 8న విడుదల కావాల్సి ఉంది. అయితే, విడుదలకు కొన్ని నెలల ముందు మే 20న అతడికి కరోనా సోకింది. దీంతో అతడిని 90 రోజులు పెరోల్ మీద ఇంటికి పంపారు. ప్రస్తుతం జైలు సూపరింటెండెంట్ శశికాంత్ మిశ్రా వృద్ధుడికి ఘనంగా సన్మానం చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వేల సంఖ్యలో వ్యూస్, లైక్స్ సంపాదిస్తోంది. ఈ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు సదరు జైలు అధికారిపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. మరి, 98 ఏళ్ల వృద్ధ ఖైదీకి జైలు అధికారులు సన్మానం చేసి బయటకు పంపటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
परहित सरिस धर्म नहीं भाई . 98 वर्षीय श्री रामसूरत जी की रिहाई पर लेने कोई नहीं आया . अधीक्षक जिला जेल अयोध्या श्री शशिकांत मिश्र पुत्रवत अपनी गाड़ी से घर भेजते हुए . @rashtrapatibhvn @narendramodi @myogiadityanath @dharmindia51 pic.twitter.com/qesldPhwBB
— DG PRISONS U.P (@DgPrisons) January 8, 2023