ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి అనేది మధురమైన జ్ఞాపకం. అందుకే ప్రతి యువత.. తమ పెళ్లిని ఎంతో ఘనంగా జరుపుకోవాలని కోరుకుంటారు. ఇలా ఎన్నో పెళ్లిళ్లు సందడిగా జరిగాయి. అయితే పెళ్లిళ్లలో ఒక్కోసారి అనుకోని ఘటనలు కూడా జరుగుతుంటాయి.
ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి అనేది మధురమైన జ్ఞాపకం. అందుకే ప్రతి యువత.. తమ పెళ్లిని ఎంతో ఘనంగా జరుపుకోవాలని కోరుకుంటారు. ఇలా ఎన్నో పెళ్లిళ్లు సందడిగా జరిగాయి. అయితే పెళ్లిళ్లలో ఒక్కోసారి అనుకోని ఘటనలు కూడా జరుగుతుంటాయి. అటువంటి ఊహకందని సంఘటన రాజస్థాన్లో చోటు చేసుకుంది. మరికొన్ని గంటల్లో పెళ్లి అనగా.. పెళ్లి కుమార్తె జంప్ అయింది. పెళ్లి దుస్తుల్లోనే వరుడు ఎదురు చూశాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
రాజస్థాన్లోని పాలీ జిల్లాలోని సౌణా గ్రామానికి చెందిన సకారామ్ అనే వ్యక్తికి మనీషా అనే కుమార్తె ఉంది. ఆమెకు వారి సమీప బంధువైన శ్రవణ్ కుమార్ తో వివాహం నిశ్చయమయ్యింది. పెళ్లి వేడుకలో భాగంగా పెళ్లి కుమారుడి తరుపు వారంతా మే 3న వధువు ఉంటున్న గ్రామానికి చేరుకున్నారు. వారికి పెళ్లి కూతురు తరుపువారు ఘనంగా స్వాగత పలికి.. అతిథి మర్యాదలు చేశారు. మే4 ఉదయం పెళ్లి కార్యక్రమం ప్రారంభమైంది. మండపంలోకి పెళ్లి కూతురిని తీసుకురావాలని పూజరి కోరాడు.
అయితే అమ్మాయి తయారవుతుందని కాసేపు కొద్దిసేపు చేయాలని పెళ్లి కుమార్తె తరపువారు చెప్పారు. వధువు మనీషా తనకు కడుపునొప్పి వస్తున్నదని చెప్పి ఇంటి వెనుక వైపు నుంచి పరారైంది. ఎంతసేపయినా వధువు తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు హడలిపోయారు. వరుడి బంధువులు అడుగుతుండే సరికి పెళ్లి కూతురు ముస్తాబు అవుతుందని ఆమె తండ్రి తెలిపాడు. ఆ తరువాత కాసేపటికి కడుపు నొప్పి వస్తుందని ఆస్పత్రికి వెళ్లిందని తెలిపారు. మరికాసేపటి తరువాత తమ సమీప బంధువైన భరత్ కుమార్ అనే వ్యక్తితో బయటకి వెళ్లిందని తెలిపారు. చివరకు ఆ వధువు ఆచూకి కనిపెట్టి.. పెళ్లి పీటల వద్దకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు.
బంధువులు ఎంత చెప్పినా వధువు పెళ్లికి ఒప్పుకోలేదు. అలా ఆమె 13 రోజుల పాటు ఇంటిలోనే మొండికేసి కూర్చుంది. అయితే ఆ యువతిపై అమితమైన ప్రేమ కలిగిన వరుడు.. పెళ్లి కోసం ధరించిన దుస్తులను కూడా తీయకుండా ఆమె కోసం ఎదురు చూస్తున్నాడు. ఎట్టకేలకు బంధువులంతా ఒప్పించి వధువును మే 15న కల్యాణ మండపానికి తీసుకురాగలిగారు. దీంతో మే 16 వారి వివాహం ఘనంగా జరిగింది. ఇలా అనేక పరిణామాల తరువాత పెళ్లి జరగడంతో ఇరు కుటుంబాల సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.