తాజాగా భోజ్ పురి నటి త్రిషకర్ మధుకు సంబంధించిన ఓ ప్రైవేట్ వీడియో లీకై ఎంత హల్చల్ చేసిందో అందరికి తెలిసిందే. ఈ వీడియో లీక్ అవ్వటంతో భిన్నమైన వాదనలు వినిపించాయి. ఇక ఈ వ్యవహారం మరువక ముందే మరో నటి ప్రైవేట్ వీడియో లీక్ అంటూ వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. భోజ్ పురి ప్రముఖ నటి ప్రియాంక పండిట్ యొక్క ప్రైవేట్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోందట.
వరుసగా భోజ్ పురికి చెందిన హీరోయిన్‌ల వీడియోలే లీక్ అవుతుండటంతో ఎన్నో అనుమానాలకు తావు ఇస్తోంది. ఇక తన వీడియోలు లీక్ అవ్వటంతో స్పందించింది నటి ప్రియాంక పండిట్. ఇందులో ఉన్నది మాత్రం నేను కాదని, కొందరు వ్యక్తులు కావాలనే ఇలా చేసి నన్ను ఇరికిస్తున్నారని అంటోంది ప్రియాంక పండిట్. దీనిపై పోలీసులకు సమాచారం ఇచ్చానని అంటూ ఓ వెబ్ సైట్‌కు తెలిపినట్లు తెలుస్తోంది. తాజాగా ఈ లీకుల వ్యవహారంలో భోజ్ పురిలో సంచనలంగా మారుతోంది.
దీంతో దీనిపై స్పందిస్తున్న కొందరు కావాలనే వాళ్ల వీడియోలను లీక్ చేసుకుని పబ్లిసిటీ పెంచుకుంటున్నారని వాపోతున్నారు. మొన్న నటి త్రిషకర్ మధు, నేడు నటి ప్రియాంక పండిట్ రేపు ఇంకోవరు అంటూ ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. వరుసగా భోజ్ పురికి చెందిన హీరోయిన్‌ల వీడియోలు లీక్ అవుతుండటంతో తీవ్ర చర్చనీయాంశమవుతోంది. దీని వెనుక ఎవరైనా ఉన్నారా..? లేక కావాలనే హీరోయిన్‌లు ఇలా చేసుకుంటున్నారా అన్నది ఇంకా తెలియాల్సి ఉంది.