ఈ మద్య కొంత మంది టీచర్లు పాఠాలతో విద్యార్థులకు బోర్ కొట్టించకుండా వారిలో ఉత్సాహాన్ని నింపడానికి పాటలు పాడటం, డ్యాన్స్ లు చేయడం లాంటివి చేస్తున్నారు. అవి కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతున్నాయి. కొన్ని నవ్వులు పూయించే విధంగా ఉంటే.. కొన్ని ఆశ్చర్యాన్ని కలిగించేలా.. భయాన్ని కలిగించేలా ఉంటున్నాయి. ఏది ఏమైనా ప్రపంచంలో జరిగే చిత్ర విచిత్రాలు సోషల్ మీడియా పుణ్యమా అని మనం చూడగలుగుతున్నాయి. ఇటీవల క్లాస్ రూమ్స్ లో టీచర్లు, స్టూడెంట్స్ కలిసి డ్యాన్స్ చేసిన వీడియోలు ఎన్నో నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాజాగా ఓ ఉపాధ్యాయురాలు విద్యార్థులతో కలసి భోజ్‌పురి పాటకు డ్యాన్స్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.
ఈ మద్య కొంత మంది టీచర్లు పాఠాలతో విద్యార్థులకు బోర్ కొట్టించకుండా, వారికి ఒత్తిడి కలిగించకుండా వారిలో ఉత్సాహాన్ని నింపడానికి పాటలు పాడటం, డ్యాన్స్ లు చేయడం లాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. తాజాగా ఓ టీచరమ్మ క్లాస్ రూమ్ లో విద్యార్థులతో కలిసి బోజ్ పూర్ మూవీ ‘కా కరిహే భయ్యా కా కరిహే’ సాంగ్ కు స్టెప్పులు వేసింది. మొదట పిల్లలు ఆ పాటకు డ్యాన్స్ చేయగా మద్యలో నిల్చుని టీచర్ కూడా స్టెప్పులు వేసింది. టీచర్ తో కలిసి విద్యార్థులు సైతం హుషారుగా డ్యాన్స్ చేశారు. ఆ సమయంలో పిల్లలంతా కెమెరావైపు చూస్తూ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
గతంలో ఈ టీచర్ క్లాస్ రూమ్ లో కొన్ని పాటలకు డ్యాన్స్ చేసి వీడియో తీసుకొని వాటిని ఇన్ స్ట్రాలో పోస్ట్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే బోజ్ పూరి పాట ‘కా కరిహే భయ్యా కా కరిహే’ కి డ్యాన్స్ చేసి ఇన్స్ స్ట్రాలో పోస్ట్ చేసింది. ఈ వీడియో చూసిన్ నెటిజన్లు రక రకాలుగా స్పందిస్తున్నారు. విద్యార్థులతో కలిసి టీచర్ చాలా బాగా డ్యాన్స్ చేసిందని.. పిల్లలకు ఎప్పుడూ చదువు ఒత్తిడిలోనే ఉంచకుండా వారిలో ఉల్లాసాన్ని.. ఉత్సాహాన్ని నింపడానికి ఇలాంటి కార్యక్రమాలను ప్రోత్సహించాలని అంటున్నారు. మరికొంతమంది ఈ మద్య సూల్స్ లో పాఠాల కన్నా ఎంజాయ్ మెంట్స్ ఎక్కువ అవుతున్నాయి.. ఇలా అయితే విద్యార్థుల భవిష్యత్ ఏమైపోతుందని ప్రశ్నిస్తున్నారు.