ఈ నెలలో సిని ఇండస్ట్రీలో తీవ్ర విషాదాలు నెలకొంటున్నాయి. టాలీవుడ్ ప్రముఖ నటుడు శరత్ బాబు కన్నుమూశారు.. బాలీవుడ్ లో సైతం వరుసగా సినీ తారలు చనిపోవడంతో అభిమానులు శోకసంద్రంలో మునిగిపోతున్నారు.
ఈ మద్య సినీ ఇండస్ట్రీలో వరుసగా విషాదాలు జరుగుతన్న విషయం తెలిసిందే. టాలీవుడ్ లో ప్రముఖ నటుడు శరత్ బాబు, బాలీవుడ్ లో యువనటుడు ఆదిత్య సింగ్ రాజ్ పూత్, నటి వైభవి ఉపాధ్యాయ, నితీష్ పాండే ఇలా వరుసగా ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబ సభ్యులు, అభిమానులు జీర్ణించుకోలేపోతున్నారు. తాజాగా సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది.. ప్రముఖ దర్శకుడు కన్నుమూశారు. వివరాల్లోకి వెళితే.
సినీ ఇండస్ట్రీలో ఇటీవల వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. తెలుగు ఇండస్ట్రీలో శరత్ బాబు.. బాలీవుడ్ లో బుల్లితెర నటీనటులు ఒక్కరోజు వ్యవధిలోనే కన్నుమూశారు. తాజాగా బోజ్ పూరి ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ డైరెక్టర్ సుభాష్ చంద్ర తివారి మరణించిన వార్త సినీ రంగాన్ని తీవ్ర విషాదంలో ముంచింది. ఓ సినిమా షూటింగ్ లో భాగంగా ఉత్తర్ ప్రదేశ్ సోన్ భద్రాకి వెళ్లారు చిత్ర యూనిట్. అక్కడ ఓ హూటల్ లో డైరెక్టర్ తో సహ చిత్ర బృందం బసచేశారు. బుధవారం రాత్రి హూటల్ డోర్ బయట నుంచి ఎంత పిలిచినా చంద్ర తివారి స్పందించకపోవడంతో అనుమానం వచ్చిన సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న పోలీసులు హూటల్ కి చేరుకొని చంద్ర తివారీ ఉన్న గది తలుపులు పగులగొట్టి చూడగా మంచంపై విగతజీవిగా పడి ఉన్నారు. ఆయన శరీరంపై ఎలాంటి గాయాలు లేవని.. ఆయన ఎలా మరణించారు అన్న విషయం తెలసుకునేందుకు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్రం ఆసుపత్రికి పంపించినట్లు పోలీసులు తెలిపారు. నివేదిక వచ్చిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని అన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్పీ యశ్వీర్ సింగ్ తెలియజేశారు. కాగా, మహారాష్ట్రకు చెందిన సుభాష్ చంద్ర తివారి భోజ్ పురిలో ఎన్నో అద్భుతమైన చిత్రాలకు దర్శకత్వం వహించారు.