బెంగళూరులో కురిసిన భారీ వర్షాల కారణంగా యువ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని భానురేఖ మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆమె జీవితంలో ఎన్ని కష్టాలు ఎదుర్కొందో గుర్తు చేసుకుంటూ సన్నిహితులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆ వివరాలు..
బెంగళూరులో కురిసిన భారీ వర్షాల వల్ల తెలుగమ్మాయి, యువ టెకీ భాను రేఖ మృతి చెందిన సంగతి తెలిసిందే. భానురేఖ బెంగళూరు ఇన్ఫోసిస్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేస్తోంది. సాఫ్ట్‌వేర్ రంగంలో.. ఇన్ఫోసిస్ కంపెనీ టాప్ ఎంఎన్‌సీ కంపెనీగా గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఈ కంపెనీలో జాబ్ సాధించడం అంటే మాటలు కాదు. ఎంతో కష్టపడి చదవాలి. ఇంటర్వ్యూలో సెలక్ట్ అవ్వడం అంటే మాటలు కాదు. ఇక ఇన్ఫోసిస్ ట్రైనింగ్ ఎంత కష్టంగా ఉంటుందో.. దానిలో జాబ్ చేసే వారిని అడిగితే చెబుతారు. ఇన్ని పరీక్షలు దాటుకుని.. ఇన్ఫోసిస్‌లో జాబ్ తెచ్చుకుని.. జీవితంలో సెటిల్ అయ్యానని సంతోషించేలోపే.. అంతులేని విషాదం చోటు చేసుకుంది. ఇక భానురేఖ జీవితంలో ఎంత కష్టపడిందో తెలిసిన వాళ్లు.. పాపం అని సానుభూతి వ్యక్తం చేస్తున్నారు.
భానురేఖ స్వస్థలం ఆంధ్రప్రదేశ్, కృష్ణా జిల్లా, తేలప్రోలు. తండ్రిది వీరపనేని గూడెం. కారణాలు తెలియదు కానీ భానురేఖ తల్లితో కలిసి.. తన అమ్మమ్మ ఇంట్లోనే పెరిగింది. తల్లి ఒంటరిగా తన బాధ్యతలు తీసుకోవడం.. తనను చదివించేందుకు ఎంతో కష్ట పడటం గమనించిన భానురేఖ అందుకు తగ్గట్టుగానే చదువులో రాణించేది. కష్టపడి చదివి.. ఇన్ఫోసిస్ లాంటి దిగ్గజ కంపెనీలో ఉద్యోగం సాధించి తల్లి, అమ్మమ్మ తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టింది. ఇన్నాళ్లు తల్లి, అమ్మమ్మ తన కోసం కష్టపడ్డారు.. ఇక మీదట తాను వారికి అండగా ఉండి.. బాగా చూసుకోవాలని భావించింది. కానీ ఆమె ఆశలు అడియాసలు అయ్యాయి.
ప్రస్తుతం బెంగళూరులో జాబ్ చేస్తోన్న భాను రేఖ.. తన కుటుంబ సభ్యులతో కలిసి నగరంలోని పర్యాటక ప్రదేశాలు చూడాలని భావించింది. దానిలో భాగంగానే క్యాబ్ బుక్ చేసుకుని ఔటింగ్‌కు బయల్దేరింది. ఇంతలో భారీ వర్షం కురవడం.. కారు కేఆర్ సర్కిల్ అండర్ పాస్ వద్దకు రాగానే వరద నీటిలో చిక్కుకుంది. ఇది గమనించిన స్థానికులు, చుట్టుపక్కల వారు.. కారులో ఉన్న భానురేఖ కుటుంబ సభ్యులను కాపాడే ప్రయత్నం చేశారు. వారిని బయటకు తీసి సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే భానురేఖ మృతి చెందింది అని తెలిపారు వైద్యులు. ఈ సంఘటనతో భానురేఖ స్వగ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. భానురేఖ పార్థివదేహం కోసం కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నారు. పోస్టుమార్టం పూర్తయిన తర్వాత భానురేఖ డెడ్‌బాడీని బెంగళూరు నుంచి తేలప్రోలుకు తీసుకురానున్నారు. మరి ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.