భారీ వర్షాల కారణంగా మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి చెందింది. ఈ వార్త తెలిసి సీఎం ఆమె ఇంటికి వెళ్లి బాధితురాలి కుటుంబాన్ని పరామార్శించారు. ఆ వివరాలు..
సీజన్‌తో సంబంధం లేకుండా.. అన్ని కాలాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ ఏడాది వేసవి కాలంలో కూడా వడగళ్ల వాన, భారీ వర్షాలు కురిసిన సంగతి తెలిసిందే. ఇక భారీ వర్షాల కారణంగా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి చెందింది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి ఆమె ఇంటికి వెళ్లి.. వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఓ సామాన్యురాలు మృతి చెందితే.. సీఎం వారి ఇంటికి వెళ్లడం కాస్త ఆశ్చర్యంగా ఉన్నప్పటికి ఆమె మృతి పట్ల బంధువులు, స్నేహితులు సంతాపం తెలుపుతున్నారు. ఇంతకు ఈ సంఘటన ఎక్కడ చోటు చేసుకుంది.. సదరు మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ పూర్తి వివరాలు..
ఆదివారం.. బెంగళూరులో.. భారీ వర్షాలు కురిసాయి. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల కారణంగా భానురేఖారెడ్డి (23) అనే మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ప్రాణాలను కోల్పోయారు. భానురేఖారెడ్డి స్వస్థలం.. ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా తేలప్రోలు. ఆమె బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేస్తోంది. ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం ఇంటికి వచ్చిన భానురేఖ.. ఆదివారం మధ్యాహ్నం కుటుంబ సభ్యులతో కలిసి బెంగళూరుకు చేరుకున్నారు. ఈ క్రమంలో కేఆర్ కూడలికి చేరుకునే సమయానికి వర్షం తీవ్రమైంది. ముందుకు వెళ్లేలోగా అక్కడి అండర్‌పాస్‌లోకి ఒక్కసారిగా నీరు చేరుకుంది. అలా వచ్చిన నీరు బయటకు వెళ్లే మార్గం లేకపోవడంతో.. ఆ ప్రాంతంలో పూర్తిగా నీరు నిండిపోయింది. దాంతో కారు బయటకు వచ్చే మార్గంలేక.. నీటిలో చిక్కుకుపోయింది.
అండర్‌పాస్‌లో కారు చిక్కుకోవడం.. దానిలో ఆరుగురు చిక్కుకున్నట్లు గుర్తించిన పోలీసులు, బెస్కాం సిబ్బంది తక్షణమే రంగంలోకి దిగారు. వారిని బయటకు తీసి ఆసుపత్రికి తరలిస్తుండగా దురదృష్టవశాత్తు భానురేఖ మరణించింది. ఆమె కుటుంబసభ్యులను చికిత్స నిమిత్తం సెయింట్ మార్థాస్ ఆసుపత్రిలో చేర్పించారు. ఈ క్రమంలో భానురేఖ మృతి గురించి తెలియడంతో.. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆసుపత్రికి వెళ్లి బాధితురాలి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆమె కుటుంబసభ్యులకు రూ.5 లక్షల పరిహారాన్ని ప్రకటించారు.
వర్షం తీవ్రతను దృష్టిలో ఉంచుకుని రానున్న రోజులలో ఇలాంటి సమస్యలు ఎదురు కాకుండా తీసుకోవలసిన చర్యలపై నగర పోలీసు కమిషనర్ ప్రతాప్‌రెడ్డి, పాలికె కమిషనర్ తుషార్ గిరినాథ్‌లతో చర్చించారు సిద్ధరామయ్య రు. బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీలోని ఇన్ఫోసిస్ క్యాంపస్‌లో భానురేఖ ఉద్యోగం చేస్తోంది. ఆమె తండ్రిది గన్నవరం మండలం వీరపనేనిగూడెం. భానురేఖారెడ్డి అమ్మతో కలిసి అమ్మమ్మ వాళ్ల ఇంట్లోనే పెరిగినట్లు బంధువులు తెలిపారు. ఈ సంఘటనపై భానురేఖా కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు సంతాపం తెలుపుతున్నారు.