మారుతున్న జీవన శైలిని బట్టి.. ఆహారపు అలవాట్లు సైతం మారుతున్నాయి. ఇక ప్రస్తుతం రోజుల్లో నాన్ వెజ్ లేనిదే ముద్ద దిగే పరిస్థితి కనిపించడం లేదు. అలాంటి వారికి చేదు వార్త చెప్పారు అధికారులు. చికెన్, మటన్, కబాబ్, ఫిష్, బిర్యానీ సెంటర్లను బ్యాన్ చేశారు.
మారుతున్న జీవన శైలిని బట్టి.. ఆహారపు అలవాట్లు సైతం మారుతున్నాయి. ఇక ప్రస్తుతం రోజుల్లో నాన్ వెజ్ లేనిదే ముద్ద దిగే పరిస్థితి కనిపించడం లేదు. రోజు రోజుకు మాంసం ప్రియులు పెరుగుతున్నారే తప్ప తగ్గడం లేదు. ఈ క్రమంలోనే చికెన్, మటన్, ఫిష్ లను ఎక్కువగా తినడానికి ఇష్టపడుతుంటారు జనాలు. ఇంటికి బంధువులు, ఫ్రెండ్స్ వస్తే చాలు.. ఇంట్లో నాన్ వెజ్ వండాల్సిందే.. మద్యం ఉండాల్సిందే. అలాంటి వారికి చేదు వార్త చెప్పారు అధికారులు. చికెన్, మటన్, కబాబ్, ఫిష్, బిర్యానీ సెంటర్లను ఆ రోజు తెరవకుండా బ్యాన్ చేశారు. ఇలా బ్యాన్ చేయడానికి కారణం ఏంటంటే?
నేటి సమాజంలో జనాలకు ముక్కలేనిదే ముద్ద దిగే పరిస్థితి కనిపించడం లేదు. అంతలా మనలో మాంసం కలిసిపోయింది. ఇక కొన్ని ప్రత్యేక సందర్భాల్లో చికెన్, మటన్, ఫిష్, బిర్యానీ, బార్ అండ్ రెస్టారెంట్ లను మూసి వేస్తుంటారు. తాజాగా బెంగళూరు ప్రజలకు బీబీఎంపీ అధికారులు నాన్ వెజ్ కు సంధించిన అన్ని షాపులతో పాటుగా హోటల్స్ కు కీలక ఆదేశాలు జారీ చేశారు. శ్రీరామ నవమి సందర్భంగా.. మార్చి 30వ తేదిన బెంగళూరులో నాన్ వెజ్ విక్రయించడాన్ని నిషేధించారు. ఈ నిషేధాన్ని ఎవరు అతిక్రమించినాగానీ కఠిన చర్యలు తీసుకుంటామని బీబీఎంపీ అధికారులు హెచ్చరించారు. ఐటీ హబ్ గా పేరుగాంచిన బెంగళూర్ లో నిత్యం కోట్లలో నాన్ వెజ్ బిజినెస్ జరుగుతుంటుంది. దాంతో షాపులు ఒక్కరోజు కూడా బంద్ ఉండవు. అయితే శ్రీరామ నవమి సందర్భంగా కచ్చితంగా అన్ని నాన్ వెజ్ షాపులతో పాటుగా బార్ అండ్ రెస్టారెంట్స్ కూడా మూసివేయాలని అధికారుల ఉత్తర్వులు జారీ చేశారు.